హాట్ టాపిక్‌గా మారిన జాన్వీ-ఇషాన్ లవ్ స్టోరీ!

డెబ్యూ మూవీతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఆ స్టార్ డాటర్ జాన్వీ. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీలో నటించి రీల్ లైఫ్ లో ఆడియన్స్ మనసుని ధడక్ అనిపించిన.. ఓ బ్యూటిఫుల్ జంట. రియల్ లైఫ్ లో కూడా లవ్ జర్నీ చేస్తున్నారు. అంతేకాదండోయ్.. పెళ్లి కాకముందే ఇద్దరూ కలిసి వంటావార్పు మొదలుపెట్టారు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఫస్ట్ మూవీ ‘ధడక్’ తోనే ఆడియన్స్ మనసు దోచుకుంది. ధడక్ మూవీలో జాన్వీ, హీరో ఇషాన్ కట్టర్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
అంతేకాదు.. ఈ జంట రీల్ లైఫ్ లో ఎంత డీప్ గా ప్రేమించుకున్నారో రియల్ లైఫ్ లో కూడా డీప్ గా లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ ని తెలియజేస్తూ.. తరుచూ హీరో ఇషాన్ తన ఇస్టాగ్రామ్ అకౌంట్ లో వీడియోస్ ని షేర్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా జాన్వీ, ఇషాన్ కలిసి వంట చేస్తోన్న స్మాల్ వీడియోని ఇషాన్ ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
‘ధడక్’ సినిమా కోసం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, డైరెక్టర్ శశాంక్ ఖైతాన్..అప్పట్లో ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించారు. అప్పుడే జాన్వీ-ఇషాన్ మధ్య ప్రేమ చిగురించింది. అంతేకాదు ధడక్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా జాన్వీ, ఇషాన్ ఓ రేంజ్ లో సందడి చేశారు. ఇక గతంలో కూడా ఇషాన్ జాన్వీ కపూర్ తో కలిసి జిమ్ లో వర్కవుట్ చేసిన వీడియోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆ మధ్య జాన్వీతో కలిసి దిగిన ఓ హాట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇద్దరి మధ్య ప్రేమ ఇంకాస్త ముదిరిందని వార్తలొచ్చాయి. మొత్తానికి జాన్వీ, ఇషాన్ లవ్ స్టోరీ ఇప్పుడు బాలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.