Dhamaka: మాస్ రాజా ఫ్యాన్స్‌కు ధమాకా లాంటి న్యూస్.. ఇక ఓటీటీలో రచ్చరచ్చే!
మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజింగ్ హిట్‌గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, ఈ సినిమాలోని మాస్ అంశాలను ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపింది.
Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజింగ్ హిట్‌గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, ఈ సినిమాలోని మాస్ అంశాలను ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపింది.
Dhamaka : 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన రవితేజ..
ఈ సినిమాలో మాస్ రాజా ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆమె నటన, అందం ఈ సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఈ సినిమాకు సంగీతం కూడా బాగా కలిసొచ్చింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమా హిట్ అవడంలో మేజర్ పాత్రను పోషించింది. కాగా థియేటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Dhamaka: ధమాకా డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా..?
ధమాకా చిత్ర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో ధమాకా మూవీని జనవరి 22న ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో మాస్ రాజా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.