Dhanush : షూటింగ్‌లో బిజీగా ఉన్నా అసిస్టెంట్ పెళ్ళికి వచ్చిన ధనుష్.. D50 లుక్ ఇదేనా?

ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయినా షూటింగ్ అవ్వగానే ధనుష్ తన అసిస్టెంట్ పెళ్ళికి వచ్చి కొత్త దంపతులని ఆశీర్వదించాడు.

Dhanush : షూటింగ్‌లో బిజీగా ఉన్నా అసిస్టెంట్ పెళ్ళికి వచ్చిన ధనుష్.. D50 లుక్ ఇదేనా?

Dhanush attends his Assistant Anand Marriage in Chennai

Updated On : September 18, 2023 / 11:51 AM IST

Dhanush : మన సెలబ్రిటీలు వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేసే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్, ఈవెంట్స్, పెళ్లిళ్లకు కచ్చితంగా హాజరవుతారు. వారికి ఏమన్నా సహాయం కావాలన్నా చేస్తారు. ఇటీవల రష్మిక తన అసిస్టెంట్ పెళ్ళికి వెళ్లి సందడి చేసింది. తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన అసిస్టెంట్ పెళ్ళికి వెళ్ళాడు.

ధనుష్ దగ్గర గత కొన్నాళ్లుగా అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆనంద్ అనే అబ్బాయి వివాహం నిన్న చెన్నైలో జరిగింది. ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయినా షూటింగ్ అవ్వగానే ధనుష్ తన అసిస్టెంట్ పెళ్ళికి వచ్చి కొత్త దంపతులని ఆశీర్వదించాడు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. తన అసిస్టెంట్ పెళ్ళికి కొంత డబ్బు కూడా ధనుష్ సాయం చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో మరోసారి ధనుష్ ని అంతా అభినందిస్తున్నారు.

Dhanush attends his Assistant Anand Marriage in Chennai

Anupama Parameswaran : నా ఏజ్ లో వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కంటుంటే నేనేమో.. అనుపమ ఆసక్తికర పోస్ట్..

ఇక ఈ పెళ్ళికి ధనుష్ కొత్త లుక్ లో వచ్చాడు. మొన్నటి దాకా ఫుల్ గడ్డం, జుట్టుతో తిరిగిన ధనుష్ ఇప్పుడు క్లీన్ షేవ్, మీసాలతో కనిపించాడు. దీంతో ఈ లుక్ వైరల్ గా మారింది. ధనుష్ 50వ సినిమాలో లుక్ ఇదేనేమో అని అభిమానులు భావిస్తున్నారు. ధనుష్ 50 వ సినిమా ధనుష్ సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.