Dhanush : కోటి రూపాయలు విరాళం ఇచ్చిన స్టార్ హీరో ధనుష్.. ఎందుకోసమో తెలుసా?
తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

Dhanush donates 1cr for new Nadigar Sangam building
తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రూ.కోటి విరాళం అందించారు. నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ కోసం ఈ మొత్తాన్ని ఇచ్చారు. కోటి రూపాయల చెక్‌ను నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్, కోశాధికారి కార్తీలకు అందించారు. ఈ విషయాన్ని అసోసియేషన్ తెలిపింది. ధనుష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చెన్నైలో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం కొత్త భవాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం నడిగర్ సంఘం విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. లోకనాయకుడు కమల్ హాసన్, దళపతి విజయ్‌లు గతంలో రూ.కోటి విరాళంగా ఇచ్చారు. హీరో శివ కార్తీకేయన్ సైతం రూ.50లక్షలు అందించారు.
Kalki 2898 AD : ‘కల్కి 2898AD’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
కాగా.. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోండగా కింగ్ నాగార్జున ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీనితో పాటు ధనుష్ స్వీయ దర్శకత్వంలో ‘రాయన్’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
South Indian Artistes’ Association member – Actor Dhanush donated a sum of rupees 1,00,00,000/- (1Crore) from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He presented the cheque to SIAA President Thiru. Nassar, Treasurer Thiru. Karthi, and… pic.twitter.com/IO4qHZWxUj
— Ramesh Bala (@rameshlaus) May 13, 2024