Dhoolpet Police Station OTT: ఆహా ఓటీటీలో “ధూల్ పేట్ పోలీస్ స్టేషన్”.. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్విస్టులకు మైండ్ పోవడం ఖాయం..
ధూల్ పేట్ పోలీస్ స్టేషన్(Dhoolpet Police Station OTT).. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, ప్రీతి శర్మ, గురు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించారు.
Dhoolpet Police Station web series now streaming on Aha OTT
Dhoolpet Police Station OTT: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్(Dhoolpet Police Station OTT)’. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, ప్రీతి శర్మ, గురు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించారు. మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్న ఈ ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 5 శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్ అందుబాటులో ఉంది.
Dookudu to Akhanda 2: దూకుడు నుంచి అఖండ 2 వాయిదా వరకు.. అసలు ఏం జరిగింది..
ఇక కథ విషయానికి వస్తే.. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్. ఎంతో, ఆసక్తికరంగా ఈ సిరీస్ ఆధ్యంతం ఆడియన్స్ ను త్రిల్ చేస్తుంది. ట్విస్టులు, టర్నులు ఆడియన్స్ కి ఒక కొత్త ఫీలింగ్ ని కలిగిస్తాయి. మరి మీకు కేసుల ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టం అనుకుకంటే వెంటనే చూసేయండి.
