Balagam : రిలీజ్ కి ముందే యాత్రలు చేస్తున్న దిల్ రాజు.. బలగం మూవీ!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాకుండా ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఈ నిర్మాణ సంస్థలో ఇటీవల ATM అనే వెబ్ సిరీస్ నిర్మించగా, తాజాగా 'బలగం' అనే చిన్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

Balagam : రిలీజ్ కి ముందే యాత్రలు చేస్తున్న దిల్ రాజు.. బలగం మూవీ!

dil raju and his wife with Balagam movie team visited nizamabad Induru Temple

Updated On : February 21, 2023 / 2:46 PM IST

Balagam : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాకుండా ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఈ నిర్మాణ సంస్థకి దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఓనర్ గా వ్యవహరిస్తుంది. ఇటీవలే ఈ ప్రొడక్షన్ నుంచి ATM అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీష్ శంకర్ కథ అందించిన ఈ వెబ్ సిరీస్ లో బిగ్‌బాస్ ఫేమ్ వి జె సన్నీ, దివి, సుబ్బరాజ్, పృద్వి రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరిలో జీ-5 లో రిలీజ్ అయిన ఈ సిరీస్ మంచి స్పందనే అందుకుంది.

Comedian Venu : దర్శకుడిగా మారుతున్న జబర్దస్త్ వేణు.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇక ఈ వెబ్ సిరీస్ తరువాత ‘బలగం’ అనే చిన్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు దిల్ రాజు. జబర్దస్త్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ‘వేణు’ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం ఈ బలగం. కాగా ఈ సినిమాలో హీరోగా ప్రియ దర్శి నటిస్తున్నాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో నటించిన ‘బేబీ కావ్య’ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టిన మూవీ టీం.. వరుస పెట్టి సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ కు ముందే యాత్రలు చేస్తున్నారు. నిజామాబాద్ లోని ఇందూరు టెంపుల్ ని సందర్శించిన మూవీ టీం.. ఆ తరువాత ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో దిల్ రాజు, అతని సతీమణి తేజస్విని, వేణు, ప్రియ దర్శి, కావ్య పాల్గొని సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ మూవీ మొత్తం సిరిసిల్ల గ్రామంలోనే జరుగుతూ, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్ ఉన్న ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి నచ్చుతుంది అంటూ దర్శకుడు వేణు తెలియజేశాడు. మరి దర్శకుడిగా వేణు విజయాన్ని అందుకుంటాడా? లేదా? చూడాలి.