అందుకే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లు సినిమాకు దూరమైపోతున్నారు: దిల్‌ రాజు

"అది కరెక్షన్ జరగాలనేది నా మొదటి పాయింట్. డిప్యూటీ సీఎం కల్యాణ్ కూడా చెప్పింది అదే" అని తెలిపారు.

అందుకే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లు సినిమాకు దూరమైపోతున్నారు: దిల్‌ రాజు

Updated On : July 1, 2025 / 9:27 PM IST

థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ పర్సెంటేజ్ విధానానికి సంబంధించి వివాదం రేగిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందన్న విషయంపై నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

“దీనిపై కమిటీ వేశారు.. కమిటీలో డిస్కషన్ జరుగుతోంది. ఒక మీటింగ్ అయినట్టుంది.. ఆ కమిటీ డ్రైవ్ చేయాలి. సింగిల్ స్క్రీన్స్ ని కాపాడుకోవాలనే నేను ప్రతిసారి చెబుతున్నాను. కాపాడుకున్నప్పుడే ఇండస్ట్రీకి ఆ థియేట్రికల్ రెవెన్యూ, అలాగే కామన్ ఆడియన్, మిడిల్ క్లాస్ ఆడియన్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్ లో వచ్చి సినిమా చూస్తారు.

Also Read: “గేమ్ ఛేంజర్‌” అసలు బాధితుడు రామ్ చరణ్.. శిరీష్ కామెంట్స్‌పై దిల్‌రాజు క్లారిటీ

ఇటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అప్పుడే ఫ్యామిలీతో సినిమాకి వెళ్తారు. ఎప్పుడైతే మల్టీప్లెక్స్ దే డామినేషన్ ఉంటుందో అప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాంలంటే రూ.1500 నుంచి 2000 మధ్య స్పెండ్ చేయాలి. అందుకే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మొత్తం సినిమాకు దూరమైపోతున్నారు.

అది కరెక్షన్ జరగాలనేది నా మొదటి పాయింట్. డిప్యూటీ సీఎం కల్యాణ్ కూడా చెప్పింది అదే. క్యాంటీన్ రేట్లు కంట్రోల్ చెయ్యాలి. చేసినప్పుడే ప్రేక్షకుడు వస్తాడు. ఆ దిశగా నేను అడుగులు వేయాలని చెప్పాను. తెలంగాణలో కూడా ప్రయత్నం చేస్తున్నాం” అని తెలిపారు.