తెలుగులో “96” కాదు.. టైటిల్ వెతుకుతున్న దిల్ రాజు

  • Published By: vamsi ,Published On : February 25, 2019 / 06:52 AM IST
తెలుగులో “96” కాదు.. టైటిల్ వెతుకుతున్న దిల్ రాజు

Updated On : February 25, 2019 / 6:52 AM IST

తమిళంలో  విజయ్ సేతుపతి, త్రిష జంటగా సూపర్ హిట్ అయిన క్లాస్ సినిమా “96”. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. తమిళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేంకుమార్ తెలుగు వెర్షన్‌నూ రూపొందించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి 96 అనే పేరునే తెలుగులో చిత్ర యూనిట్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే తాజాగా తెలుస్తున్న విషయం ప్రకారం ఈ సినిమాకు తెలుగు అర్థం వచ్చేలా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టపైటిల్ కోసం కొందరిని సూచనలు అడిగినట్లు చెప్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తమిళంలో 96 ను 1996 టైమ్ పీరియడ్ లో తీయగా తెలుగులో మాత్రం కొన్ని మార్పులు చేసినట్లు చెబుతున్నారు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా సెట్స్ ఎక్కేనాటికి సినిమా టైటిల్ ఫిక్స్ చేసుకునే యోచనతో చిత్రబృందం ఆలోచిస్తుంది. అయితే సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే విషయమై చిత్ర యూనిట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమిళ్ “96” మూవి కథ విషయానికి వస్తే రామ్, జానకి అనే ఇద్దరు చిన్ననాటి క్లాస్‌మేట్ లు. వారి స్నేహం ప్రేమగా చిగురించాక తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోతారు. అయితే ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయికలో కలుసుకుంటారు. ఆ తర్వాత ఒక్కరోజు రాత్రి మొత్తం ఏం జరిగిందనేదే కథ. సినిమా ఆధ్యంతం ఎమోషన్స్ తో చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. తమిళంలోనే ఈ సినిమా విడుదల అయ్యినప్పటికీ సినిమా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. ఇక తెలుగులో ఈ సినిమా ఏ మేరకు ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.