Dil Raju : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాము.. ఓటీటీ రిలీజ్‌లపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

ఓటీటీలోకి త్వరగానే వచ్చేస్తుంది సినిమా అంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకు అని చాలా మంది అనుకుంటున్నారు.

Dil Raju : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాము.. ఓటీటీ రిలీజ్‌లపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

Dil Raju Sensational Comments on Movies Fast OTT Releases in Revu Trailer launch Event

Updated On : August 17, 2024 / 8:22 AM IST

Dil Raju : గత కొన్నాళ్లుగా సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదని అందరూ అంటున్నారు. అందులో ముఖ్య కారణాలు పెరిగిన టికెట్ రేట్లు ఒకటి అయితే ఇంకోటి సినిమాలు థియేటర్లో రిలీజయిన తర్వాత త్వరగా ఓటీటీలోకి వచ్చేయడం. ఇటీవల చిన్న సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాకే సినిమాని మొదలుపెడుతున్నారు కొంతమంది నిర్మాతలు.

దీంతో ఓటీటీలోకి త్వరగానే వచ్చేస్తుంది సినిమా అంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకు అని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నా ఫలితం లేదు. తాజాగా దిల్ రాజు దీనిపై డైరెక్ట్ గానే కామెంట్స్ చేసాడు. ఓ చిన్న సినిమా ‘రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు పాల్గొనగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Rishab Shetty : నేషనల్ బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి.. ఒకప్పుడు రాత్రి పూట నీళ్ల క్యాన్లు మోసి..

దిల్ రాజు మాట్లాడుతూ.. చిన్న సినిమా అని వదిలేయకండి. థియేటర్ కి వెళ్లి చూడండి. ఇటీవల చాలా మంది థియేటర్ కి వచ్చి సినిమాలు చూడట్లేదు. అసలు ఆడియన్స్ ని మేమే చెడగొట్టాము. మీరు ఇంట్లోనే కూర్చోండి. నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుంది అని మేమే వాళ్ళని చెడగొట్టి ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేసుకున్నాము అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. దిల్ రాజు నిర్మాతలు చేసే తప్పుని ఒపుకున్నారా? థియేటర్లకి జనాలు రాకపోవడానికి నిర్మాతలే కారణమా అని మరోసారి చర్చ జరుగుతుంది.