Rishab Shetty : నేషనల్ బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి.. ఒకప్పుడు రాత్రి పూట నీళ్ల క్యాన్లు మోసి..
నేషనల్ బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి గురించి, అతని లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..

National Best Actor Kanthara Hero Director Rishab Shetty Life Story Interesting Facts
Rishab Shetty : 2022లో కన్నడలో చిన్న సినిమాగా రిలీజయిన కాంతార ఆ తర్వాత పెద్ద హిట్ అయి దేశమంతా రిలీజయి ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమా 400 కోట్లు కలెక్ట్ చేయడమే కాక కన్నడ లోకల్ సంసృతి, సాంప్రదాయాలు అద్భుతంగా చూపించారని, రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడని దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
తాజాగా నిన్న ప్రకటించిన 70వ నేషనల్ అవార్డుల్లో కాంతార సినిమా రెండు అవార్డులను గెలుచుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టికి ప్రకటించారు. అలాగే కాంతార సినిమాకు బెస్ట్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్మెంట్ అవార్డు కూడా ప్రకటించారు. అయితే రిషబ్ శెట్టికి ఇదే మొదటి భారీ పాన్ ఇండియా సక్సెస్ అయినా సినిమా కష్టాలు చూసి ఫెయిల్యూర్స్, సక్సెస్ లు చూసి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు.
Also Read : AR Rahman : అత్యధిక నేషనల్ అవార్డులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రహమాన్.. మొత్తం ఎన్ని అవార్డులు..?
రిషబ్ శెట్టి గురించి, అతని లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..
#రిషబ్ శెట్టి చిన్నప్పుడు చదువుల్లో కంటే ఆటల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొనేవాడు. జూడోలో డిస్ట్రిక్ లెవల్ ప్లేయర్ కూడా. అయితే అది రిషబ్ తండ్రికి నచ్చకపోవడంతో కాలేజీ సమయానికి బెంగుళూరులో చదువుకోడానికి పంపించారు.
#చిన్నప్పట్నుంచి టీవీలో పాటలు, సినిమాలు చూసి నటుడు అవుదామనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఉపేంద్ర సినిమాలు చూసి దర్శకుడు అవ్వాలనుకున్నాడు.
#చిన్నప్పుడు ఊళ్ళో వాళ్ళతో కలిసి పలు నాటకాల్లో కూడా నటించాడు. మీనాక్షి కల్యాణి అనే యక్షగాన ప్రదర్శనలో షణ్ముగ పాత్రకు రిషబ్ కి ఊర్లో మంచి పేరు వచ్చింది.
#బెంగుళూరులో డిగ్రీలో జాయిన్ అయ్యాక ‘రంగసౌరభం’ అనే బృందంలో చేరి నాటకాలు వేసాడు.
#డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం తండ్రికి తెలిసి కోప్పడ్డారు కూడా.
#ఆ సమయంలో తండ్రి డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో అక్క కొంచెం హెల్ప్ చేసినా ఆర్థికంగా తను సంపాదించుకోవాలని మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టి సాయంత్రం, రాత్రి పూట వాటర్ క్యాన్లు సప్లై చేసేవాడు. రాత్రాంతంతా క్యాన్లు సప్లై చేసి ఆ వ్యాన్ లోనే నిద్రపోయేవాడు.
#వాటర్ క్యాన్లు సప్లై చేస్తున్న సమయంలో ఓ క్లబ్ లో కన్నడ నిర్మాత MD ప్రకాష్ కనపడటంతో తన గురించి చెప్పి అవకాశం అడిగాడు. డైరెక్షన్ కోర్స్ చదువుతూ పార్ట్ టైం చేస్తున్నాడని తెలిసి సైనైడ్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పించాడు ఆ నిర్మాత. ఆ సినిమాకు రిషబ్ కు రోజుకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు.
#అక్కడ ఎడిటింగ్, లైట్ బాయ్, మేకప్.. ఇలా అన్ని పనులు నేర్చుకున్నాడు. కానీ ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో మళ్ళీ వాటర్ క్యాన్లు మోసుకున్నాడు.
#ఆ తర్వాత గండ హెండతి అనే సినిమాకు క్లాప్ బాయ్ గా చేరాడు. ఆ సినిమా మొత్తానికి సంవత్సరం మొత్తం చేసింనందుకు 1500 రూపాయలు జీతం తీసుకున్నాడు.
#గండ హెండతి సినిమా షూట్ లో డైరెక్టర్ తో జరిగిన ఓ సంఘటనతో సినిమాలు మానేద్దామని డిసైడ్ అయి తన దగ్గర ఉన్న డబ్బుతో, ఇంకొంచెం అప్పు తీసుకొని ఓ హోటల్ బిజినెస్ పెట్టాడు. కానీ అది లాస్ అయి అప్పుల్లో మునిగిపోయాడు. దీంతో మళ్ళీ సినిమా అవకాశాల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.
#కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసి తినడానికి సంపాదించుకొనేవాడు. అప్పుల వాళ్లకు కనపడకుండా ఆ సమయంలో మరు వేషాల్లో తిరిగాడు. అప్పుడే ఓ సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
#అలాంటి సమయంలో దర్శకుడు అరవింద్ కౌశిక్, రక్షిత్‌శెట్టితో రిషబ్‌కు పరిచయమైంది. అరవింద్ కౌశిక్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా, రిషబ్ ఓ ముఖ్య పాత్రలో తుగ్లక్ సినిమా చేసారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.
#తుగ్లక్ ఫ్లాప్ తర్వాత రిషబ్ దర్శకత్వంలో రక్షిత్ హీరోగా రిక్కీ సినిమాని తీయగా అది మంచి హిట్ అయింది.
#ఆ తర్వాత ఒక మంచి ఆర్ట్ సినిమా తీద్దామనుకున్నారు. కానీ ఎవరూ డబ్బులు పెట్టేందుకు రాలేదు. దీంతో మళ్ళీ రిషబ్ దర్శకత్వంలో రక్షిత్ హీరోగా కిరిక్ పార్టీ సినిమా తీస్తే అది పెద్ద హిట్ అయింది.
#ఆ సినిమాలో వచ్చిన డబ్బులతో ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ అనే తన డ్రీం ప్రాజెక్టుని తీశారు. ఈ సినిమా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
#ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు రిషబ్ శెట్టి.
#కాంతార సినిమాతో నటుడిగా, దర్శకుడిగా మెప్పించి కమర్షియల్ హిట్ కొట్టి ఇప్పుడు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు.
#త్వరలో కాంతార ప్రీక్వెల్ సినిమాతో రాబోతున్నాడు రిషబ్ శెట్టి.
My heart is filled with Gratitude ??#Kantara #Kantarachapter1 #70thNationalFilmAwards pic.twitter.com/zAnCJShlxw
— Rishab Shetty (@shetty_rishab) August 16, 2024
రిషబ్ శెట్టి ఇలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి సొంతంగా ఎదిగి ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవడమే కాక నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా సాధించాడు. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు రిషబ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.