AR Rahman : అత్యధిక నేషనల్ అవార్డులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రహమాన్.. మొత్తం ఎన్ని అవార్డులు..?

ఇప్పటివరకు అత్యధిక నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

AR Rahman : అత్యధిక నేషనల్ అవార్డులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రహమాన్.. మొత్తం ఎన్ని అవార్డులు..?

AR Rahman Creates New Record with Winning Highest National Awards as Music Director

Updated On : August 17, 2024 / 6:47 AM IST

AR Rahman : నిన్న 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పొన్నియన్ సెల్వన్ 1 సినిమాకు గాను బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవార్డు ఏఆర్ రహమాన్ కి ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు అత్యధిక నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

ఇప్పటివరకు ఏఆర్ రహమన్ ఏకంగా 7 నేషనల్ అవార్డులు అందుకున్నాడు. రహమన్ మొదటిసారి 1992లో రోజా సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ విభాగంలో మొదటి నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 1996లో మినసారా కనవు(మెరుపు కలలు) సినిమాకు, 2001లో లగాన్ సినిమాకు, 2002లో కణ్ణాతిల్ ముత్తమిత్తల్(అమృత) సినిమాకు, 2017లో కాట్రు వెలియడై(చెలియా) సినిమాకు, 2017లో శ్రీదేవి మామ్ సినిమాకు గాను నేషనల్ అవార్డులు గెలుచుకున్నాడు రహమాన్.

Also Read : Sreeleela : శ్రీలీల కొత్త యాడ్ చూశారా? నాట్యం చేస్తూ..

ఇందులో అయిదు సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ విభాగంలో నేషనల్ అవార్డు గెలుచుకోగా, మామ్ సినిమాకు, ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 1కు రెండు సార్లు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విభాగాల్లో నేషనల్ అవార్డులు గెలుచుకున్నాడు. వీటిల్లో రెండు హిందీ సినిమాలు కాగా అయిదు తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు అత్యధికంగా 7 నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ రికార్డ్ సృష్టించాడు. ఇళయరాజా 5 సార్లు, విశాల్ భరద్వాజ్ 4 సార్లు గెలుచుకొని ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.