Sreeleela : శ్రీలీల కొత్త యాడ్ చూశారా? నాట్యం చేస్తూ..

ఇప్పటికే పలు యాడ్స్ చేసిన శ్రీలీల తాజాగా ఓ కొత్త యాడ్ చేసింది.

Sreeleela : శ్రీలీల కొత్త యాడ్ చూశారా? నాట్యం చేస్తూ..

Sreeleela New Commercial Advertisement Video goes Viral

Updated On : August 16, 2024 / 9:44 PM IST

Sreeleela : ఒక్కసారిగా పాపులర్ అయి వరుస సినిమాలు చేసిన శ్రీలీల ప్రస్తుతం ఖాళీ అయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో రెండు సినిమాలే ఉన్నాయని సమాచారం. ఇటీవల సినిమాలతో రాకపోయినా సోషల్ మీడియాలో, బయట ఈవెంట్స్ లో రెగ్యులర్ గా బిజీగానే ఉంది శ్రీలీల. ఇక సెలబ్రిటీలంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ చేస్తారు. అదే ఫార్ములా శ్రీలీల కూడా మొదట్నుంచి ఫాలో అవుతుంది.

Also Read : Narne Nithiin – Aay Movie : వర్షం, మబ్బుల కోసం అయిదు నెలలు ఆగిపోయిన ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా షూట్..

ఇప్పటికే పలు యాడ్స్ చేసిన శ్రీలీల తాజాగా ఓ కొత్త యాడ్ చేసింది. శాస్త్రి బామ్ అనే బ్రాండ్ కి శ్రీలీల యాడ్ చేసింది. ఈ యాడ్ లో శ్రీలీల, ఇంకో అమ్మాయి నాట్యం చేస్తున్నట్టు, నాట్యం చేస్తుండగా పెయిన్ వస్తే శ్రీలీల ఆ బామ్ తెచ్చి ఇచ్చినట్టు యాడ్ ని చిత్రీకరించారు. శ్రీలీల ఈ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ యాడ్ ని చూసేయండి..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)