Ashish : సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న యువ హీరో.. దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి..
టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.

Dil Rajus Brother Son Young Hero Ashish Got Engaged with Advitha Reddy
Ashish : టాలీవుడ్ లో ఇటీవలే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు(Dil Raju). వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు దిల్ రాజు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చి దిల్ రాజుతో కలిసి పనిచేస్తున్నారు. శిరీష్ తనయుడు ఆశిష్(Ashish) రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో కూడా రాబోతున్నాడు. అంతలోనే మూడో సినిమా కూడా అనౌన్స్ చేశాడు.
Also Read : Prabhas : ప్రభాస్ ఓట్ ఎందుకు వేయలేదు? కమల్ హాసన్ వచ్చినందుకేనా?
ఇప్పుడు ఆశిష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డితో ఆశిష్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. ఆశిష్ – అద్విత నిశ్చితార్థానికి చెందిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్స్, ప్రముఖులు ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుందని సమాచారం.