Prabhas : ప్రభాస్ ఓట్ ఎందుకు వేయలేదు? కమల్ హాసన్ వచ్చినందుకేనా?

నేడు ఓట్ వేయడానికి ప్రభాస్ రాలేదు. అయితే ఇందుకు కారణం కమల్ హాసన్(Kamal Haasan) అని అంటున్నారు.

Prabhas : ప్రభాస్ ఓట్ ఎందుకు వేయలేదు? కమల్ హాసన్ వచ్చినందుకేనా?

Prabhas dont cast his vote Due to Kamal Haasan why full details Here

Updated On : November 30, 2023 / 8:29 PM IST

Prabhas : నేడు తెలంగాణ(Telangana Elections) వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా హైదరాబాద్ లో ఓట్లెయడానికి క్యూ కట్టారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, విజయ్ దేవరకొండ.. లాంటి స్టార్ హీరోలతో పాటు రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల.. మరింతమంది దర్శకులు.. ఇంకా అనేకమంది సినిమా, టీవీ సెలబ్రిటీలు వచ్చి ఓటేశారు.

ఆల్మోస్ట్ చిన్నా పెద్ద హీరోలంతా, సినీ ప్రముఖులంతా వచ్చి ఓట్ వేశారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఓట్ వేయలేదు. ఓటింగ్ వేయడానికి వచ్చిన హీరోల ఫొటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో ఆయా హీరోల అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ ఓట్ వేయడానికి రాకపోవడమే కారణం.

నేడు ఓట్ వేయడానికి ప్రభాస్ రాలేదు. అయితే ఇందుకు కారణం కమల్ హాసన్(Kamal Haasan) అని అంటున్నారు. ప్రభాస్ లైన్లో పెట్టిన భారీ సినిమాల్లో కల్కి 2898AD సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ ప్రమోషన్స్ లో కూడా కమల్ హాసన్ పాల్గొన్నారు. కమల్ కూడా మరో మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో కమల్ డేట్స్ ఇచ్చినప్పుడే ఆయన ఉన్న సీన్స్ కల్కి టీం షూట్ పెట్టుకుంటుంది.

కమల్ హాసన్ ఇప్పుడు డేట్స్ ఇచ్చి హైదరాబాద్ వచ్చాడు. తాజాగా నేడు హైదరాబాద్ లో కల్కి(Kalki) షూటింగ్ లో పాల్గొనడానికి కమల్ హాసన్ వచ్చారు. ప్రభాస్ తో కమల్ కి ఉన్న కాంబినేషన్ సీన్స్ ఉండటంతో నేడు ప్రభాస్ కూడా కల్కి షూట్ లో జాయిన్ అయ్యాడు. కమల్ హాసన్, నిర్మాత స్వప్న దత్.. మరికొంతమంది ఉన్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Also Read : Naga Chaitanya : సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పై స్పందించిన నాగ చైతన్య..

అయితే కమల్ కల్కి షూట్ కి డేట్స్ ఇచ్చి రావడం వల్లే ప్రభాస్ కూడా షూట్ లో జాయిన్ అయి ఓట్ వేయడానికి రాలేదని సమాచారం. దీంతో ఓటింగ్ కి రాలేదని ప్రభాస్ అభిమానులు ఓ పక్క నిరాశ చెందుతూనే మరోపక్క కల్కి షూటింగ్ అవుతుందని సంతోషపడుతున్నారు. ఇక కల్కి సినిమా వచ్చేసంవత్సరం సమ్మర్ కి రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ రేపు డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.