10 TV Food Fusion Awards 2025: తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పేసిన అనిల్ రావిపూడి..
10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ను ఉద్దేశించి అనిల్ రావిపూడి మాట్లాడారు.

Director Anil Ravipudi
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో.. మొట్టమొదటిసారిగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాం. టాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీస్, ఫుడ్ లవర్స్ మనసుదోచిన వెరైటీస్… తిరుగులేని టేస్ట్, క్వాలిటీ, ఇన్నోవేషన్‌కు పట్టంగట్టాం.
తెలంగాణ పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా అతిరథమహారథులతో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఫుడ్ ఇండస్ట్రీని సత్కరించిన అపూర్వ వేదిక 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్.
హైదరాబాద్‌ను ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనడంలో అతిశయోక్తి లేదు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ప్రతి ఫుడ్ వెరైటీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తారు. మనకు ఫుడ్ కడుపు నింపే పదార్థం మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. 10టీవీ ఫుడ్ ఫ్యూషన్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పలు కేటగిరీల్లో అవార్డులు అందించాం.
10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ను ఉద్దేశించి అనిల్ రావిపూడి మాట్లాడారు. “ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ఇస్తున్నందుకు 10టీవీ నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను. అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ.. ఇది ఫస్ట్ టైం అని చెప్పారు.. సో హోప్ ఇట్ దిస్ విల్ కంటిన్యూ అగైన్ అండ్ అగైన్ అండ్” అని అన్నారు.
అనిల్ రావిపూడి తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలిపారు. “నేను పెరుగు అన్నం బాగా ఇష్టపడతాను. హోమ్ ఫుడ్ తింటాను. టిపికల్ సాంబార్ రైస్ అండ్ పెరుగన్నం తింటాను. లంచ్ కయితే బిర్యానీ.. సాయంత్రం అయితే సరదాగా టిఫిన్స్ ఇడ్లీ, చపాతీలు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను” అని అన్నారు.