Yellamma: అనౌన్స్ మెంట్ లేదు.. డైరెక్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారట.. సరికొత్తగా రానున్న ఎల్లమ్మ
ఎల్లమ్మ(Yellamma).. ఈ సినిమాను ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలియదు కానీ, అన్నీ అడ్డంకులే. దర్శకుడు బలగం వేణు తెరకెక్కించిన మొదటి సినిమా రెండేళ్లు దాటింది.
Director Balagam Venu announcing his Next film Yellamma with a glimpse
Yellamma: ఎల్లమ్మ.. ఈ సినిమాను ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలియదు కానీ, అన్నీ అడ్డంకులే. దర్శకుడు బలగం వేణు తెరకెక్కించిన మొదటి సినిమా రెండేళ్లు దాటింది. ఆ సినిమాను రిలీజ్ తరువాత తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ అంటూ అధికారిక ప్రకటన చేశాడు దర్శకుడు బలగం వేణు. కానీ, ఇప్పటివరకు ఆ సినిమా షూటింగ్ మొదలవలేదు. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తరుగాత ఒక దర్శకుడు తన నెక్స్ట్ సినిమా కోసం ఇంత సమయం తీసుకోవడం విశేషం అనే చెప్పాలి. కానీ, ఎల్లమ్మ(Yellamma) సినిమా కథను ఎప్పుడో పూర్తి చేశాడు వేణు. మరి ఆలస్యానికి కారణం ఏంటా అని చాలా మందికి వచ్చే సందేహమే.
దానికి, కారణం ఈ సినిమాకు హీరో సెట్ కాకపోవడం. అదేదో కథ నచ్చక కాదు. కథ బాగున్నప్పటికీ ఈ సినిమాకు హీరో సెట్ అవడం లేదు. ముందుగా ఈ సినిమాకు హీరోగా నేచురల్ స్టార్ నాని హీరో అనుకున్నారు. కానీ, కథ బాగున్నప్పటికీ తన ఇమేజ్ కి సెట్ అవదు అంటూ నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ఈ ప్రాజెక్టులోకి మరో యంగ్ హీరో శర్వానంద్ వచ్చాడు. కానీ, ఈ హీరో అప్పటికే చాలా సినిమాలకు ఒప్పుకొని ఉన్నాడు కాబట్టి డేట్స్ కారణంగా శర్వా కూడా ఈ ప్రాజెక్టు నుంచి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు హీరోల తరువాత ఎల్లమ్మ సినిమాకి ఒకే అయిన తెలంగాణ హీరో ఎవరంటే నితిన్. ఈ హీరోతో సినిమా సెట్ చేయడానికి అని సెట్ అయ్యి.
ఇక రెగ్యులర్ షూటింగ్ మాత్రమే ఆలస్యం అనుకున్నాడు జనాలు. కానీ, అనూహ్యంగా కథ అక్కడ కూడా అడ్డం తిరిగింది. రీసెంట్ గా నితిన్ నుంచి వచ్చిన దాదాపు 6 సినిమాలకు డిజాస్టర్ అయ్యాయి. కాబట్టి, నితిన్ తో ఎల్లమ్మ సినిమా చేస్తే ఆ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందేమో అని భావించిన మేకర్స్ ఆయన్ని కూడా ఈ సినిమా నుంచి తప్పించారు. ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించాయి. కానీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, తాజాగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఎల్లమ్మ సినిమాను అధికారికంగా ప్రకటించడమే కాదు.. డైరెక్ట్ గా గ్లింప్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. దీనికి సంబందించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం. హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ని అనౌన్స్ చేస్తే అంతగా ఇంపాక్ట్ ఉండదని.. డైరెక్ట్ గ్లింప్స్ తో చెప్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది అని టాక్.
