బాలూ.. నాకు మాటలు రావట్లేదు… నువ్వు పాడితే వినాలనుంది..

  • Published By: sekhar ,Published On : August 21, 2020 / 03:10 PM IST
బాలూ.. నాకు మాటలు రావట్లేదు… నువ్వు పాడితే వినాలనుంది..

Updated On : August 21, 2020 / 3:45 PM IST

SP Balasubramaniam: ప్రముఖ గాయకులు, గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల‌ కరోనా వైర‌స్ సోక‌డంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ కూడా బాలు ఆరోగ్య పరిస్థితి తెలుపుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంగీత ప్రపంచమే కాకుండా ఆయన అభిమానులెందరో ప్రార్థనలు చేస్తున్నారు.



తాజాగా ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంను తొందరగా కోలుకుని రా.. నువ్వు పాడితే వినాలని ఉంది..అంటూ ట్వీట్ చేశారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.
‘‘బాలూ… నాకు మాటలు రావట్లేదు… నువ్వు పాడితే వినాలనుంది.. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్లతో ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాము… నీ గంభీరమైన స్వరంతో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా…’’ అంటూ దర్శకేంద్రుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.