Director Krish : సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఆమె ఎవరో తెలుసా?

తాజాగా నేడు క్రిష్ డాక్టర్ ప్రీతీ చల్లాను రెండో వివాహం చేసుకున్నాడు.

Director Krish : సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఆమె ఎవరో తెలుసా?

Director Krish Married Doctor Priti Challa Photos goes Viral

Updated On : November 11, 2024 / 5:52 PM IST

Director Krish : వేదం, గమ్యం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి.. లాంటి పలు సినిమాలతో హిట్స్ కొట్టిన డైరెక్టర్ క్రిష్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. గతంలో క్రిష్ రమ్య వెలగ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరు విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు క్రిష్ డాక్టర్ ప్రీతీ చల్లాను రెండో వివాహం చేసుకున్నాడు.

Also Read : Aha Dance Ikon : ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 వచ్చేసింది.. మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆడిషన్ ఇచ్చేయండి..

ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రీతీ చల్లాని డైరెక్టర్ క్రిష్ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. క్రిష్, ప్రీతి ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రీతి ప్రముఖ చల్లా హాస్పిటల్స్ ఫ్యామిలీకి చెందిన వారు. ఈమె చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీలో MBBS, గైనకాలజిస్ట్ లో MS చేసింది. ప్రస్తుతం చల్లా హాస్పిటల్ లో సీనియర్ గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటున్నారు ప్రీతీ.

పెళ్లి తర్వాత దిగిన ఫొటోలతో ఓ చిన్న వీడియో చేసి తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రీతీకి కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అని సమాచారం. ఇక పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dr.Priti Challa (@dr.pritichalla)

ఇటీవల పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమా డైరెక్ట్ చేయగా పలు కారణాలతో ఆ సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నాడు.