Kalki Story : ‘కల్కి’ కథ చెప్పేసిన నాగ్ అశ్విన్.. మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ.. కాశీలో మొదలయి కాశీలో ముగిసే కథ..

తాజాగా నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన మరో వీడియోలో కల్కి కథ చెప్పారు.

Director Nag Ashwin Reveals Klki 2898AD Movie Story

Kalki Story : ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే కల్కి కథ మహాభారతం చివర, ప్రపంచం అంతం అయ్యే సమయం.. ఇలా ఆసక్తిగా ఉండబోతుందని ఇప్పటికే నాగ్ అశ్విన్ చెప్పడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా నిన్న రాత్రి ముంబైలో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన మరో వీడియోలో కల్కి కథ చెప్పారు.

Also See : Rana Daggubati : కల్కి మూవీ టీమ్ తో రానా ఇంటర్వ్యూ చూశారా?

కల్కి కథేంటి అంటే.. మూడు ప్రపంచాల మధ్య ఈ కథ జరుగుతుంది. గంగానది ఒడ్డున ఉన్న పవిత్ర కాశీ నగరం ప్రపంచంలోనే మొదటినగరం అని చెప్తారు. అయితే అదే చివరి నగరం కూడా అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ ఉంటుంది. భూమి మీద అన్ని వనరులు అంతరించిపోతాయి. కానీ కాశీలో కాంప్లెక్స్ మనుషులు అని కొంతమంది ప్రత్యేకంగా నిర్మించుకొని ఉంటారు. అక్కడ అన్ని దొరుకుతాయి. సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లాలని భావిస్తూ ఉంటారు. కానీ కాంప్లెక్స్ మనుషులు వేరే మనుషులని రానివ్వరు. అక్కడికి వెళ్లాలంటే మిలియన్ యూనిట్స్(డబ్బుల లాంటివి) కావాలి. ఇలా కాంప్లెక్స్ ప్రపంచం, సాధారణ మనుషులు జీవించే కాశీ ప్రపంచంతో పాటు ఇంకో ప్రపంచం శంబాలా ఉంటుంది. పురాణాల ప్రకారం కల్కి ఈ నగరంలోనే పుడతాడు. కాంప్లెక్స్ లో డబ్బున్న మనుషులు, నిర్జీవంగా మారిన కాశీ మనుషులు, శరణార్థులు తల దాచుకునేలా శంబాలా నగరం.. ఇలా ఈ మూడు ప్రపంచాలను కలుపుతూ కథ ఉంటుంది అని తెలిపారు నాగ్ అశ్విన్.

Also Read : Deepika Padukone : ప్రభాస్ పెట్టే ఫుడ్ పై దీపికా కామెంట్స్.. కేటరింగ్ సర్వీస్ లాగా చాలా ఫుడ్..

ఆ మూడు ప్రపంచాల మధ్య జరిగే పోరాటం, బతకడికి మనుషులు చేసే పోరాటంతో సినిమా సాగుతుంది అని తెలిపాడు నాగ్ అశ్విన్. అలాగే కథకు దగ్గట్టు కాంప్లెక్స్ మనుషులు, కాశీలో మనుషులకు తగ్గట్టు ఆయుధాలు, బట్టలు.. అన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసాము అని తెలిపాడు. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.