Prashanth Neel : సలార్ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో చెప్పిన ప్రశాంత్ నీల్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22 న రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడో చేసారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మీడియాతో పంచుకున్నారు.

Prashanth Neel : సలార్ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో చెప్పిన ప్రశాంత్ నీల్

Prashanth Neel

Updated On : December 1, 2023 / 7:11 PM IST

Prashanth Neel : ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ ఇటీవల ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.

Maa oori polimera 2 ott : ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

సలార్ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్, పోస్టర్స్ తప్ప ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో సలార్ కథ ఫ్రెండ్ షిప్ చుట్టూ తిరుగుతుందని..ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ ‘ఉగ్రం’ కథతోనే సలార్ తెరకెక్కిస్తున్నారని ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే రెండు సినిమాలకు ఎటువంటి కనెక్షన్ లేదని కూడా  క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

ప్రశాంత్ నీల్ సలార్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయలు షేర్ చేసుకున్నారు. సలార్ సినిమా తీయాలనే ఆలోచన 15 సంవత్సరాల క్రితమే ఆయన మనసులో మెదిలిందట. కానీ మొదటి సినిమా ‘ఉగ్రం’ చేసిన తర్వాత KGF తో బిజీ అయ్యారట . ఆ సినిమా టూ పార్ట్స్ కంప్లీట్ అయ్యేసరికి 8 సంవత్సరాలు గడిచిపోయాయి. అందుకే  ఇంత సమయం పట్టిందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

Upendra Gadi Adda : ‘ఉపేంద్రగాడి అడ్డా’ మూవీ రివ్యూ.. డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేయాలి అనే కమర్షియల్ కథలో..

సలార్ సినిమా షూటింగ్ చాలామటుకు  హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేసారట. దాంతో పాటు సింగరేణిలో, సౌత్ పోర్ట్స్, మంగళూరు పోర్ట్, వైజాగ్ పోర్ట్‌లలో కూడా షూటింగ్ చేశారట. వీటితో పాటు యూరప్ లోనూ ఓ చిన్న పార్ట్ షూట్ చేసినట్లు ప్రశాంత్ నీల్ చెప్పారు. సలార్ కంప్లీట్ చేయడానికి దాదాపుగా 114 రోజులు టైమ్ పట్టిందట. సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదని దానిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు ప్రశాంత్ నీల్. సలార్‌లో మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు