Maa oori polimera 2 ott : ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

Maa oori polimera 2 ott streaming date : మా ఊరి పొలిమేర 2 చిత్రం న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Maa oori polimera 2 ott : ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

Maa oori polimera 2

Updated On : December 1, 2023 / 6:29 PM IST

సత్యం రాజేష్‌ ప్రధాన పాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2021లో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుద‌లైంది. అదిరిపోయే ట్విస్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన మా ఊరి పొలిమేర 2 చిత్రం న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో న‌టించి మెప్పించారు.

Malavika Mohanan : ఎవరైనా నా చేయి పట్టుకోండి.. ఆ హీరోయిన్ పోస్టు వైరల్

ఇక సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి ఇది శుభ‌వార్త‌. డిసెంబ‌ర్ 8 న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని ఆహా సంస్థ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ ఆహా గోల్డ్ చందారులు 24 గంట‌ల ముందునే ఈ సినిమా చూసేందుకు వీలు క‌ల్పించింది. వీరు డిసెంబ‌ర్ 7నే ఈ చిత్రాన్ని చూడొచ్చు.