Online Cinema Tickets : ఏపీ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

ఏపీలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయంపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని రాఘవేంద్ర రావు కోరారు.

AP Cinema Tickets : ఏపీలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనే ప్రభుత్వం నిర్ణయంపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గించడంపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు టికెట్ల అంశంపై ఆయన సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. చిత్రపరిశ్రమలో తాను 45ఏళ్లు దర్శకుడిగా, నిర్మాతగానూ తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలన్నారు. ప్రేక్షకులు థియేటర్స్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్‌లు, నిర్మాతలు అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం టిక్కెట్లు, షోల నిర్ణయంతో చాలా మంది తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సిస్టమ్ వల్ల దోపిడీ ఆగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే రూ.300 కాదు రూ.500 పెట్టీ అయినా చూస్తాడు.. ఒక రూపాయికే సినిమా అన్న అతనికి నచ్చక పోతే చూడడని తెలిపారు.

థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతిని ప్రేక్షకుడు టీవీలో ఎప్పటికీ పొందలేడని చెప్పారు. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుందనన్నారు. అలా కాకుండా ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల రేట్లు పెంచితే థియేటర్ల వల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ట్యాక్స్ వస్తుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని దర్శకుడు కె రాఘవేంద్ర రావు విజ్ఞప్తి చేశారు.

Read Also : AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

ట్రెండింగ్ వార్తలు