Vishal: అసలు విశాల కి ఏమైంది.. డైరెక్టర్స్ తో పడటం లేదా.. ఇలా అయితే చాలా కష్టం..

హీరో విశాల్ కి తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. ఆయన సినిమాలు (Vishal)తమిళంలో ఎంతలా ఆదరణ పోడుతాయో తెలుగులో కూడా ఇంచుమించు అదే రేంజ్ లో ఆదరణ లభిస్తుంది.

Vishal: అసలు విశాల కి ఏమైంది.. డైరెక్టర్స్ తో పడటం లేదా.. ఇలా అయితే చాలా కష్టం..

Director Ravi Arasu has dropped out of Vishal's Makutam film.

Updated On : October 22, 2025 / 6:57 PM IST

Vishal: హీరో విశాల్ కి తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. ఆయన సినిమాలు తమిళంలో ఎంతలా ఆదరణ పోడుతాయో తెలుగులో కూడా ఇంచుమించు అదే రేంజ్ లో ఆదరణ లభిస్తుంది. అందుకే ఆయన ప్రతీ సినిమాను తెలుగులో (Vishal)కూడా మార్కెట్ చేసుకుంటూ వస్తున్నాడు. విశాల్ హీరోగా వచ్చిన గత చిత్రాలు రత్నం, మదగజ రాజు సినిమాలు పెద్దగా ఆడలేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం ఆయన తుప్పారివాలం 2, మకుటం అనే సినిమాలు చేస్తున్నాడు.

Chandru: నా సినిమా చూసి ‘ఓజీ’ చేశారు.. సీన్స్ అలానే ఉన్నాయి.. కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

అయితే, ఈ మధ్య కాలంలో విశాల్ కి ఏమయ్యిందో అర్థం కావడంలేదు. ప్రతీ సినిమాలో ఎదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. డైరెక్టర్స్ తో పడక ఏకంగా వారిని ప్రాజెక్ట్ నుంచి తీసేస్తున్నాడు. ఇప్పటికే తుప్పారివాలం సినిమా నుంచి దర్శకుడు మిస్కిన్ ను తొలగించిన హీరో విశాల్ స్వయంగా ఆయనే దర్శకుడిగా చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిని తొలగించాడు విశాల్. అదే మకుటం. ఈ సినిమాను ముందుగా రవి అరసు తెరకేక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు టీజర్ కూడా విడుదల అయ్యింది. ఆ టీజర్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, దీపావళి కానుకగా విడుదలైన పోస్టర్ లో మాత్రం దర్శకుడిగా విశాల్ పేరు కనిపించింది. అది చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు.

దీంతో, అసలు విశాల్ కి ఏమైంది. ప్రతీ ప్రాజెక్ట్ లో ఎదో ఒక వివాదం వస్తూనే ఉంది. ఇలా ప్రతీ సినిమా నుంచి దర్శకులను మార్చితే సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే విశాల డైరెక్ట్ చేస్తున్న తుప్పారివాలం 2 సినిమా ఎక్కడివరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. అసలు ప్రాజెక్ట్ ఉందోలేదో కూడా తెలియదు. ఇంకా ఆ సినిమా కంప్లీట్ అవక ముందే మరో సినిమాను భుజాలపై వేసుకున్నాడు. మరి ఈ సినిమా గతి ఏమవుతుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, మార్క్ అంటోనీ సినిమాతో విశాల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ, ఆ ఫాం కోల్పోవడానికి ఎంతో టైం పట్టలేదు. ప్రెజెంట్ ఆయనకు ఒక సాలిడ్ హిట్ అవసరం. అలాంటిది, ఈ టైం లో ఇలాంటివి చేయడం వల్ల అది సినిమాపై నేగిటీవ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మకుటం సినిమా పని ఏమవుతుందో చూడాలి.