యంగ్ డైరెక్టర్ పెళ్లి! కాస్త గందరగోళం?

  • Published By: sekhar ,Published On : July 17, 2020 / 12:03 PM IST
యంగ్ డైరెక్టర్ పెళ్లి! కాస్త గందరగోళం?

Updated On : July 17, 2020 / 2:28 PM IST

‘క్షణం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న యువ దర్శకుడు రవికాంత్ పేరెపు ఓ ఇంటివాడయ్యాడు. సుమారు 5 సంవత్సరాలుగా వీణా ఘంటశాల అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రవికాంత్ ఎట్టకేలకు ఈ శనివారం చెన్నైలో అతి తక్కువ మంది సమక్షంలో తన పెళ్లి వేడుకను ముగించినట్లుగా తెలుస్తుంది.Ravikanth Perepu

అయితే రవికాంత్ పేరెపు పెళ్లి 2017లోనే అయిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి ఫోటోలు కూడా అప్పట్లో విడుదల చేశారు. మరి మళ్లీ ఆయన పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. అప్పట్లో ఆయన చేసుకున్న అమ్మాయి పేరు కూడా వీణ అనే వినిపించింది.

Ravikanth Perepu

మరి మళ్లీ వీణ అనే అమ్మాయితోనే పెళ్లి జరిగింది. మరి ఈ కన్ఫ్యూజన్ ఏమిటో తెలియాలంటే ఆయనే అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రవికాంత్ పేరెపు తన భార్య వీణాతో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

2017లో రవికాంత్ పేరెపు పెళ్లి అయినట్లుగా విడుదలైన ఫోటో..

Ravikanth Perepu

ఇక రవికాంత్ పేరెపు తాజాగా దర్శకత్వం వహించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, షాలిని, శీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు.