Suriya: పాపం సూర్య.. ఇప్పుడు వచ్చుంటే.. బాక్సాఫీస్ షేక్ అయ్యేది

హీరో సూర్య.. తమిళ హీరో అయినప్పటికే తెలుగులో కూడా మంచి స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు ఈ హీరో(Suriya). సూర్య నుంచి సినిమా వస్తుంది అంటే తెలుగు హీరోకి చేసేంత హంగామా చేస్తారు ఆయన ఫ్యాన్స్.

Suriya: పాపం సూర్య.. ఇప్పుడు వచ్చుంటే.. బాక్సాఫీస్ షేక్ అయ్యేది

Director RJ Balaji's interesting comments on the release of Kuruppu movie

Updated On : October 22, 2025 / 3:59 PM IST

Suriya: హీరో సూర్య.. తమిళ హీరో అయినప్పటికే తెలుగులో కూడా మంచి స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు ఈ హీరో. సూర్య నుంచి సినిమా వస్తుంది అంటే తెలుగు హీరోకి చేసేంత హంగామా చేస్తారు ఆయన ఫ్యాన్స్. కానీ, ఈ మధ్య సూర్య టైం అస్సలు బాలేదు. ఆయన నుంచి వచ్చిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. నార్మల్ ఆడియన్స్ ను పక్కన పెడితే ఆయన ఫ్యాన్స్ కి కూడా నచ్చడంలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువా సినిమా కూడా (Suriya)డిజాస్టర్ గా నిలిచింది. దీంతో, నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు సూర్య. ఈనేపధ్యంలోనే దర్శకుడు ఆర్జే బాలాజీ “కురుప్పు” సినిమాను మొదలుపెట్టాడు.

Rashmika Mandanna: ఈ ప్రయాణాన్ని ఎలా వివరించాలి.. ప్రతీ భావన హృదయాన్ని తాకుతోంది.. మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది..

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా దీపావళికి విడుదల అవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. తాజాగా కురుప్పు సినిమా వాయిదాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. “నిజానికి కురుప్పు సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే పనులు కూడా పూర్తి చేశాం. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే, సినిమా విడుదల కాకుండా పాటను విడుదల చేశాం” అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో, సూర్య అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు, నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈ దీపావళి పండుగ సమయంలో తమిళ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కొత్త హీరో ప్రదీప్ రంగనాథన్ తప్పితే. కాబట్టి, ఈ సమయంలో సినిమాను రిలీజ్ చేసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చేదని అంటున్నారు. కొంచం పాజిటీవ్ టాక్ వస్తే బాక్సాఫీస్ షేక్ అయ్యేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే, సూర్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని, దీనికైనా రాసిపెట్ట్టి ఉండాలని అనిపిస్తోంది. ఇక కురుప్పు కొత్త విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.