Rashmika Mandanna: ఈ ప్రయాణాన్ని ఎలా వివరించాలి.. ప్రతీ భావన హృదయాన్ని తాకుతోంది.. మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ థామా(Rashmika Mandanna). హారర్ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ ను తెచుకుంది.

Rashmika Mandanna: ఈ ప్రయాణాన్ని ఎలా వివరించాలి.. ప్రతీ భావన హృదయాన్ని తాకుతోంది.. మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది..

Rashmika mandanna interesting post about thamma movie

Updated On : October 22, 2025 / 3:29 PM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ థామా. హారర్ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ ను తెచుకుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు (Rashmika Mandanna)ఆదిత్య సర్పోదర్‌ తెరకెక్కించాడు. ఇక సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో తన కృతజ్ఞతను సోషల్ మీడియా ద్వార తెలియజేసింది ఈ బ్యూటీ.

Ramya Krishna: సినిమా కాదు.. ఐటెం సాంగ్స్ చేయాలని ఉంది.. జగపతిబాబుకి షాకిచ్చిన రమ్యకృష్ణ

ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “థామా.. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఎక్కడినుంచి మొదలుపెట్టాలి.. ఎలా వివరించాలి. మొదటిరోజు నుంచి చివరిరోజు వరకూ ప్రతిదీ మనసుకు హత్తుకునేదే. ఈ సినిమా షూటింగ్ సమయంలో నవ్వులు, గాయాలు, నిద్ర లేవడానికి ఇష్టపడని ఉదయాలు అన్నీ మనసులో గుర్తుండిపోతాయి. ఇక దర్శకుడు ఆదిత్య సర్పోదర్‌పై గౌరవంతో నా మనసు నిండిపోయింది. ఆయన నాపై నమ్మకం ఉంచారు. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన సిబ్బంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. షూటింగ్‌ను సజావుగా సాగింది అంటే దానికి కారణం వాళ్ళే. షూటింగ్ లో పడిన కష్టమంతా సినిమాకు వచ్చే పాజిటివ్‌ కామెంట్స్‌కు మర్చిపోతాం. ఇక నా ఫ్యాన్స్.. మీ ప్రేమ, మీ సపోర్ట్.. మీ ప్రతి భావన నా హృదయాన్ని తాకుతుంది. నామనసులో నిలిచిపోతుంది. అందరికీ నా కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రష్మిక చేసిన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను దర్శకడు రాహుల్ రవీంద్రన్ తెరకేక్కిస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంలో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.