రవితేజ కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ ‘డిస్కో రాజా’ – డైరెక్టర్ వి.ఐ.ఆనంద్
‘డిస్కో రాజా’ దర్శకులు వి.ఐ.ఆనంద్ ఇంటర్వూ..

‘డిస్కో రాజా’ దర్శకులు వి.ఐ.ఆనంద్ ఇంటర్వూ..
‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని అభిరుచి గల దర్శకుడిగా గుర్తింపు పొందారు వి.ఐ.ఆనంద్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, వి.ఐ.ఆనంద్‌దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ఫిక్షన్ చిత్రం.. ‘డిస్కోరాజా’. రామ్‌తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.ఐ.ఆనంద్ ‘డిస్కో రాజా’ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘‘కెరీర్ పరంగా డిస్కోరాజా నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా. పెద్ద బడ్జెట్ సినిమా కూడా. నా కెరీర్ ముందుకు వెళ్లడానికి కూడా ఈ సినిమా సక్సెస్ ముఖ్యమని నమ్ము తున్నాను. ఐస్‌ల్యాండ్ షెడ్యూల్ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించలేదు. అయినప్పటికీ రిస్క్ చేశాం. కష్టపడి తీశాం. ఈ సీన్స్ సినిమాలో కీలకంగా ఉంటాయి. కథ ప్రకారం కూడా చాలా ముఖ్యమైన సీక్వెన్స్ ఇది. సినిమా చూసినప్పుడు ఈ విషయం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. కిస్టోఫర్ నోలాన్ ఈ లొకేషన్‌లోనే సినిమా తీశారు. సేమ్ లొకేషన్‌లో షూట్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది’’.
Read Also : ‘‘హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’’ – 50 మిలియన్ వ్యూస్
‘‘సైన్స్ ఫిక్షన్ నా ఫేవరెట్ జానర్. ఫ్యాంటసీ అంటే నాకు ఇష్టం. పదేళ్ల క్రితమే ఈ సినిమా మెయిన్ పాయింట్ ఆలోచన నాకు ఉంది. ఈ పాయింట్‌పై వర్క్ చేస్తున్నాను. అయితే ఆడియన్స్‌కు కన్విన్సింగ్‌గా చెప్పడానికి నాకు సరైన మెటీరియల్ దొరకడం లేదు. ఇటీవల ఏడాదిన్నర క్రితం బయో రీసెర్చ్‌కి చెందిన ఓ ఆర్టికల్ చదివాను. దాని ఆధారంగా అలాంటి పరిశోధన ఒకటి సక్సెస్ అయితే వెండితెరపై ఆడియన్స్‌కు కన్విన్సింగ్‌గా ఎలా ఉంటుంది అనే అంశం ఆధారంగా ‘డిస్కోరాజా’ తీశాను. సినిమా బటర్‌ఫ్లై టైటిల్ లోగోకు సినిమాలో జస్టిఫికేషన్ ఉంది. ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ టైమ్ తీసుకున్నాం’’..
‘‘ఇది డిఫరెంట్ కాన్పెప్ట్ మూవీ. లైవ్ పోర్షన్, రెట్రో సీక్వెన్స్, సెన్స్ ఫిక్షన్ ఇలా మూడు రకాల సీక్వెన్స్ ఉన్నాయి. డిస్కోరాజా క్యారెక్టర్ ఒక్క రవితేజగారికే సెట్ అవుతుంది. ఈ సినిమాలో మ్యూజిక్ లవ్వింగ్ గ్యాంగ్‌స్టర్‌గా చేశారు రవితేజ. మిథున్ చక్రవర్తి ఫ్యాన్. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన క్యారెక్టర్, యాటిట్యూడ్ హైలైట్‌గా ఉంటాయి. డిస్కోరాజా క్యారెక్టర్ ఒక్క రవితేజగారికే సరిపోతుంది’’..
‘‘డిస్కోరాజా ఒక సైన్స్‌ఫిక్షన్ డ్రామా. సినిమాలో ఏదీ కావాలని పెట్టలేదు. కామెడీ, యాక్షన్ , ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు స్టోరీలో కుదిరాయి. రవితేజగారి నుంచి ఆయన అభి మానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్ అదనపు ఆకర్షణ’’..
‘‘రవితేజగారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంది. ఆయన క్యారెక్టర్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యారు. ఆడియన్స్ ఆయన క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతారు. రవితేజగారు ఓ డిఫరెంట్ మూవీ చేయాలనుకున్నప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఆయనకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు డిస్కో మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని రవితేజగారు ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లోని టాప్ ఫైవ్ బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’..
‘‘ఈ సినిమాలో నభానటేష్, తాన్యాహోప్, పాయల్‌రాజ్‌పుత్ నటించారు. ఢిల్లీకి చెందిన బ్యాంకు ఉద్యోగిగా కనిపిస్తారు నభానటేష్, సైంటిస్ట్ పాత్రలో నటించారు తాన్యా. ఇక రెట్రో ఎపిసోడ్స్‌లో పాయల్‌రాజ్‌పుత్ వస్తారు. చెన్నైకి చెందిన బర్మాసేతు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించారు బాబీ సింహా. నిర్మాత రామ్ తాళ్లూరి బాగా సహకరించారు. ఆయన కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. సీనియర్ నరేష్‌గారు ఓ కీలక పాత్ర చేశారు. సునీల్‌గారు, వెన్నెల కిశోర్, సత్య కామెడీ పార్టులో వస్తారు. వీళ్లంతా కథ ప్రకారమే వస్తారు’’..
‘‘కాన్సెప్ట్ మూవీస్‌లో కూడా కమర్షియాలిటీ ఉండొచ్చు. ‘డిస్కోరాజా’ చిత్రం అలాంటిదే.
గతంలో నేను తీసిన ‘ఒక్కక్షణం’ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేవు. సరైన సమయంలో విడుదల కాలేదనిపించింది. నేను సైంటిఫిక్ వేలో దేవుణ్ణి నమ్ముతాను. గీతా ఆర్ట్స్‌లో నాకు కమిట్‌మెంట్ ఉంది. రెండు, మూడు కథలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌లో నా తర్వాతి సినిమా ఉండొచ్చు’’.. అంటూ ఇంటర్వూ ముగించారు దర్శకులు వి.ఐ.ఆనంద్.