Aditi Shankar : సంవత్సరం టైం.. అవకాశాలు రాకపోతే సినిమా పేరెత్తకూడదు.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్..
శివకార్తికేయన్(Siva Karthikeyan) సరసన అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన సినిమా మహావీరుడు(Mahaveerudu) నేడు రిలీజ్ అయింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అదితి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది.

Director Shankar gave warning to his Daughter Aditi Shankar when she wants to be a heroine
Aditi Shankar : డైరెక్టర్ శంకర్(Director Shankar) కూతురు అదితి శంకర్ సింగర్ గా, నటిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటుంది. అదితి డాక్టర్ కూడా. ఇటీవలే MBBS కూడా పూర్తిచేసింది. అయితే అదితి సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు, హీరోయిన్(Heroine) అవుతా అన్నప్పుడు డైరెక్టర్ శంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. శివకార్తికేయన్(Siva Karthikeyan) సరసన అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన సినిమా మహావీరుడు(Mahaveerudu) నేడు రిలీజ్ అయింది.
గత కొన్ని రోజులుగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అదితి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది. అదితి మాట్లాడుతూ.. నాన్న పెద్ద డైరెక్టర్ అవ్వడంతో చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. హీరోయిన్ అవ్వాలని ఎప్పట్నుంచో ఉన్నా MBBS చదివేటప్పుడు చివర్లో హీరోయిన్ కావాలని ఉందని నాన్నకి చెప్పాను. మొదట నో చెప్పారు. కానీ ఆ తర్వాత తన పేరు వాడుకోకుండా సినిమా అవకాశాల కోసం ట్రై చేయి, సినిమా ఇండస్ట్రీ అంత తేలిక కాదు, సంవత్సరం టైం ఇస్తాను, ఈ లోపు ఛాన్సులు రాకపోతే ఇంకెప్పుడూ సినిమా పేరెత్తకూడదు అని చెప్పారు. దానికి నేను ఓకే చెప్పాను అని తెలిపింది.
Raviteja : శివకార్తికేయన్ కోసం రవితేజ.. మహావీరుడు సినిమాకి మాస్ మహారాజా స్పెషల్..
ఇక అదితి MBBS చివర్లో ఉన్నప్పుడే కార్తీ హీరోగా తెరకెక్కిన విరుమన్ సినిమాలో డైరెక్ట్ హీరోయిన్ గా మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. మోడ్రన్ గా ఉన్న అమ్మాయి ఆ సినిమాలో పల్లెటూరి పాత్ర చేస్తుందా అని కార్తీ సందేహం వ్యక్తం చేసినా తన నటనతో మెప్పించింది. ఇక అక్కడ్నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత సింగర్ గా కూడా కెరీర్ మొదలుపెట్టింది. వరుణ్ తేజ్ గని సినిమాలో మొదటిసారి ఓ సాంగ్ పాడింది. ఇప్పుడు హీరోయిన్ గా, సింగర్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది అదితి శంకర్.