Srinu Vaitla: ఫైనల్ గా శ్రీను వైట్లకు హీరో దొరికేశాడు.. డైనమిక్ స్టార్ తో సూపర్ మూవీ..

టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కామెడీ(Srinu Vaitla) చిత్రాలకు, కమర్షియల్ సినిమాలకు ఆయన కేరాఫ్. మహేష్ బాబుతో ఆయన చేసిన దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Srinu Vaitla: ఫైనల్ గా శ్రీను వైట్లకు హీరో దొరికేశాడు.. డైనమిక్ స్టార్ తో సూపర్ మూవీ..

Director Srinu Vaitla to make a film with Sharwanand

Updated On : October 24, 2025 / 9:00 PM IST

Srinu Vaitla: టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కామెడీ చిత్రాలకు, కమర్షియల్ సినిమాలకు ఆయన కేరాఫ్. మహేష్ బాబుతో ఆయన చేసిన దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ, ఏమైందో తెలియదు ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల(Srinu Vaitla) చేసిన సినిమాలేవి అంతగా ఆడలేదు. హిట్ అవడం పక్కన పెడితే కనీసం యావరేజ్ కూడా నిలువలేక డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల ఆయన గోపించంద్ తో చేసిన విశ్వం సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో శ్రీను వైట్ల ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.

Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ.. అందంతో చేస్తోంది మాయ.. ఫోటోలు

ఈ నేపధ్యంలోనే ఒక యంగ్ హీరో ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. అవును, దర్శకుడు శ్రీను వైట్ల ఇటీవల హీరో శర్వానంద్ ను కలిసి ఒక కథను వినిపించాడట. కథలో కమర్షియల్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ కంటెంట్ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో వెంటనే ఒకే చెప్పేశాడట శర్వానంద్. ఈ సినిమాతో ఖచ్చితంగా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయతిస్తున్నాడట శ్రీను వైట్ల. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు సంపత్ నందితో భోగి అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత శర్వానంద్ నారి నారి నడుమ మురారి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా బైకర్ అనే మరో సినిమా చేస్తున్నాడు శర్వానంద్. బైక్ రేసింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే పవిడుదల కానుంది. ఈ మూడు సినిమాల తరువాత శ్రీను వైట్ల-శర్వానంద్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.