Sukumar : సొంతూళ్లో సుకుమార్.. రామ్ చరణ్ సినిమా, థియేటర్స్ సమస్య పై కామెంట్స్..

తాజాగా సుకుమార్ తన సొంతూరు మట్టపర్రుకి వెళ్లారు.

Sukumar : సొంతూళ్లో సుకుమార్.. రామ్ చరణ్ సినిమా, థియేటర్స్ సమస్య పై కామెంట్స్..

Sukumar Comments in Ram Charan RC 17 Movie and Theaters Issue

Updated On : May 21, 2025 / 8:45 AM IST

Sukumar : సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాతో ఇండియా వైడ్ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడు. దీంతో సుకుమార్ నెక్స్ట్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలోనే సుకుమార్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండలతో సినిమాలు ప్రకటించాడు.

సుకుమార్ పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ RC17 సినిమానే చేయబోతున్నట్టు ఇటీవల ప్రకట్టించాడు. చరణ్ పెద్ది సినిమా పూర్తిచేసుకొని వచ్చేలోపు సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి రెడీ గా ఉంటే RC17 మొదలవుతుంది. అయితే తాజాగా సుకుమార్ తన సొంతూరు మట్టపర్రుకి వెళ్లారు. అక్కడ తన బంధువులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.

Also Read : Vijay – Balakrishna : ఒక్క సీన్ కోసం 4 కోట్లు ఇచ్చారా? విజయ్ పొలిటికల్ కెరీర్ కోసం బాలయ్య సినిమాలోని సీన్..

ఈ సందర్భంగా సుకుమార్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చరణ్ తోనే నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. RC17 స్క్రిప్టు వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పుష్ప 2 దర్శకుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సొంతూరికి వస్తాను మూడేళ్లుగా పుష్ప సినిమాల చిత్రీకరణతో ఖాళీ లేక రాలేదు. వచ్చే సంక్రాంతికి తప్పకుండా వస్తాను అని తెలిపారు.

ఇక ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అనే దానిపై స్పందిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లలో ఇంకా సినిమాలు చూస్తున్నారు. నగరాల్లో మాత్రమే ఓటీటీలకు అలవాటు పడ్డారు అని వ్యాఖ్యానించారు.

Also Read : ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఒకరు స్టార్ హీరో.. ఇంకొకరు దర్శక నిర్మాత..