Vijay – Balakrishna : ఒక్క సీన్ కోసం 4 కోట్లు ఇచ్చారా? విజయ్ పొలిటికల్ కెరీర్ కోసం బాలయ్య సినిమాలోని సీన్..
తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

Vijay Jananayagan Movie Unit buys Balakrishna Bhagavanth Kesari Remakes Rights only for one scene
Vijay – Balakrishna : తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. కెరీర్ లో లాస్ట్ మూవీ, ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న మూవీ అని తెలుస్తుంది. హెచ్. వినోత్ డైరెక్షన్లో విజయ్, పూజాహెగ్డే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న జననాయగన్ సినిమా నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజవుతోంది. షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది.
అయితే ఈ జననాయగన్ సినిమా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని వార్తలు వచ్చాయి ఇన్నాళ్లు. భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ కూడా కొనుక్కున్నారు అని అధికారిక సమాచారమే వచ్చింది. ఇప్పుడు అసలు ఇది రీమేక్ కాదు కొత్త కథే అని అంటున్నారు. జననాయగన్ సినిమా కోసం భగవంత్ కేసరి రైట్స్ ని దాదాపు నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు.
Also Read : ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఒకరు స్టార్ హీరో.. ఇంకొకరు దర్శక నిర్మాత..
తాజా సమాచారం ప్రకారం సినిమాని కాకుండా జస్ట్ ఒక్కసీన్ ని మాత్రమే రీమేక్ చేయడానికే ఇన్ని కోట్లు ఖర్చుపెట్టారట. భగవంత్ కేసరి సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే సీన్ ఉంటుంది. అది మంచి ఎమోషన్ ని పండించింది. కేవలం ఆ సీన్ ని మాత్రమే రీమేక్ చేయడానికి భగవంత్ కేసరి రైట్స్ కొనుక్కున్నారని తెలుస్తుంది. ఇది తప్ప మిగిలిన సినిమా మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అని, అసలు భగవంత్ కేసరికి, జననాయగన్ కి సంబంధం లేదని తమిళ పరిశ్రమ అంటుంది.
ఆ సీన్ మంచి సీన్ కాబట్టి ఎన్నికలకు వెళ్లేముందు వచ్చే తన లాస్ట్ సినిమాలో ఆ సీన్ ఉంటే విజయ్ కి పొలిటికల్ గా కూడా కలిసి వస్తుందని భావించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక్క సీన్ రీమేక్ కోసం 4 కోట్లు ఇచ్చి రైట్స్ కొనుక్కున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. విజయ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ జననాయగన్ సినిమాలో పూజాహెగ్డే తో పాటు ప్రేమలు హీరోయిన్ మమితా బైజు కూడా నటిస్తోంది. విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా విజయ్ లాస్ట్ మూవీ. ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్, తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read : HariHara VeeraMallu : నేడే ‘హరిహర వీరమల్లు’ మొదటి ప్రెస్ మీట్.. ఎన్ని గంటలకు? ఎక్కడ? పవన్ వస్తాడా?