ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఒకరు స్టార్ హీరో.. ఇంకొకరు దర్శక నిర్మాత..

ఇంతకీ ఈ ఫొటోలో క్యూట్ గా ఉన్న పాప, బాబు ఎవరా అనుకుంటున్నారా?

ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఒకరు స్టార్ హీరో.. ఇంకొకరు దర్శక నిర్మాత..

Find These Tollywood Brother and Sister from Childhood Photo

Updated On : May 21, 2025 / 7:54 AM IST

అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు వైరల్ అవుతాయని తెలిసిందే. తాజాగా ఓ హీరో ఈ చిన్నప్పటి ఫోటోని షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫొటోలో క్యూట్ గా ఉన్న పాప, బాబు ఎవరా అనుకుంటున్నారా?

Find These Tollywood Brother and Sister from Childhood Photo

ఈ ఫొటోలో ఉన్న బాబు ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఆ పాప నాని అక్క దీప్తి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి వరుస సినిమాలతో విజయాలు సాధించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు నాని. వరుసగా 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ తన సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాడు. ప్రతి సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. మరో పక్క నిర్మాతగా కూడా మారి మంచి మంచి సినిమాలు నిర్మిస్తూ కొత్త వాళ్లకు ఛాన్సులు ఇస్తున్నాడు.

Also Read : HariHara VeeraMallu : నేడే ‘హరిహర వీరమల్లు’ మొదటి ప్రెస్ మీట్.. ఎన్ని గంటలకు? ఎక్కడ? పవన్ వస్తాడా?

ఇక నాని అక్క దీప్తి దర్శకురాలిగా మీట్ క్యూట్ అనే ఓటీటీ సినిమా తెరకెక్కించింది. అలాగే నాని నిర్మాణ సంస్థలో నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది. భవిష్యత్తులో దర్శకురాలిగా మరో సినిమా కూడా చేస్తాను అని తెలిపింది. ఇలా అక్కా తమ్ముళ్లు ఇద్దరూ సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు.

Find These Tollywood Brother and Sister from Childhood Photo

ఇటీవల నాని అక్క దీప్తి పుట్టిన రోజు కావడంతో ఈ చిన్ననాటి ఫోటో షేర్ చేసి క్యూట్ గా శుభాకాంక్షలు తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

 

Also Read : Janhvi Kapoor : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జాన్వీ కపూర్ హొయలు.. ముత్యాల దండలతో మురిపెంగా..