HariHara VeeraMallu : నేడే ‘హరిహర వీరమల్లు’ మొదటి ప్రెస్ మీట్.. ఎన్ని గంటలకు? ఎక్కడ? పవన్ వస్తాడా?

హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా మొదటి ప్రెస్ మీట్ ని ఇవాళే నిర్వహించనున్నారు.

HariHara VeeraMallu : నేడే ‘హరిహర వీరమల్లు’ మొదటి ప్రెస్ మీట్.. ఎన్ని గంటలకు? ఎక్కడ? పవన్ వస్తాడా?

Pawan Kalyan HariHara VeeraMallu Movie First Press Meet

Updated On : May 21, 2025 / 7:25 AM IST

HariHara VeeraMallu : ఎట్టకేలకు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పూర్తి చేయడంతో మూవీ యూనిట్ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తుంది. ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే మరో పక్క ప్రమోషన్స్ కూడా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా నేడు మూడో సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అలాగే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా మొదటి ప్రెస్ మీట్ ని ఇవాళే నిర్వహించనున్నారు.

పవన్ హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ నేడు మే 21న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఉదయం 11 గంటల నుంచి జరగనుంది. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాత ఏఎం రత్నం, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ అయితే కచ్చితంగా వస్తారని సమాచారం. పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది చర్చగా మారింది.

Also Read : Ruchi Gujjar : ‘కాన్స్ ఫిలిం ఫెస్టివల్’లో ‘నరేంద్రమోదీ’ నక్లెస్ వేసుకున్న నటి.. వైరల్ అవుతున్న మోదీ లాకెట్ నక్లెస్..

సాధారణంగానే పవన్ ప్రమోషన్స్ కి హాజరవరు. కేవలం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారు. ఇప్పుడు రాజకీయాల బిజీలో ప్రమోషన్స్ అంటే కష్టమే కాబట్టి పవన్ రాకపోవచ్చు అనే తెలుస్తుంది. అయితే పవన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే OG షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి ప్రెస్ మీట్ కి హజరవుతాడేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లోనే హరిహర వీరమల్లు మూడో సాంగ్ ని 12 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

మొత్తానికి అయిదేళ్ల క్రితం మొదలైయిన హరిహర వీరమల్లు పవన్ రాజకీయాల బిజీ వల్ల సాగుతూ వచ్చి ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని జూన్ 12 న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ అవ్వబోతుంది. నేటి ప్రెస్ మీట్ లో సినిమా గురించి, పవన్ గురించి మూవీ యూనిట్ ఏం చెప్తారో అని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan HariHara VeeraMallu Movie First Press Meet

Also Read : NTR Remuneration : ‘వార్ 2’ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? బాలీవుడ్ లో చర్చగా ఎన్టీఆర్ రెమ్యునరేషన్..