Director Vassishta : రజినీకాంత్ తో బాషా సీక్వెల్.. ఆల్రెడీ కథ చెప్పి ఒప్పించి.. కానీ.. విశ్వంభర డైరెక్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
వశిష్ట రజినీకాంత్ కి కూడా కథ చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని తెలిపాడు.

Director Vassishta
Director Vassishta : డైరెక్టర్ వశిష్ట బింబిసార తర్వాత ఏకంగా మెగాస్టార్ తో ఛాన్స్ కొట్టేసి విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. VFX కారణంగా విశ్వంభర సినిమా ఆలస్యం అవుతుంది. తాజాగా వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలు తెలిపాడు.
ఈ క్రమంలో వశిష్ట రజినీకాంత్ కి కూడా కథ చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని తెలిపాడు.
Also Read : Rashmika – Prerana : రష్మిక ఆమెని పట్టించుకోవట్లేదా? ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. బిగ్ బాస్ భామ ఎమోషనల్..
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. దిల్ రాజు గారి ద్వారా బింబిసార అయ్యాక రజినీకాంత్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పాను. ఆయన ఓకే అన్నారు. రజినీకాంత్ గారు బింబిసార సినిమా చూసి కాల్ చేసి అభినందించారు. నా స్టోరీలో కొన్ని ఛేంజెస్ చెప్పారు. అది బాషా కి సీక్వెల్ లాంటి సినిమా. కానీ నాకే సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా లేదనిపించింది. రాజు గారికి అదే చెప్పాను. కథ పర్ఫెక్ట్ గా లేకుండా రజినీకాంత్ తో ముందుకు వెళ్ళకూడదు అన్నాను. తర్వాత రజినీకాంత్ గారిని కలిస్తే వరుసగా సినిమాలు ఉన్నాయి మనం తర్వాత చూద్దాం అన్నారు. దాంతో ఆ కథ అక్కడితో ఆగిపోయింది. తర్వాత నిర్మాత విక్కీ ద్వారా చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి విశ్వంభర కథ చెప్పి ఓకే చేసుకున్నాను అని తెలిపాడు.
అయితే రజినీకాంత్ వాయిదా వేశాడు కానీ సినిమా వద్దనలేదు, వశిష్ట కూడా కథలో కొంత ఛేంజెస్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి విశ్వంభర తర్వాత రజినీకాంత్ తో సినిమా ఉంటుందేమో చూడాలి.
Also Read : Anchor Sravanthi : పాతబస్తీలో యాంకర్ స్రవంతి సింపుల్ లుక్స్.. ఫొటోలు..