Rashmika – Prerana : రష్మిక ఆమెని పట్టించుకోవట్లేదా? ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. బిగ్ బాస్ భామ ఎమోషనల్..
తాజాగా బిగ్ బాస్ భామ, నటి ప్రేరణ కంభం రష్మిక తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఎమోషనల్ అయింది.

Rashmika Prerana
Rashmika – Prerana : సినీ, టీవీ పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్న సంగతి తెలిసిందే. చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లు కూడా పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అయి ఇంకా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ భామ, నటి ప్రేరణ కంభం రష్మిక తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఎమోషనల్ అయింది.
కన్నడ, తెలుగులో సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రేరణ. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా పాల్గొంది. తాజాగా ప్రేరణ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. హోస్ట్ జబర్దస్త్ వర్ష.. మీరు, రష్మిక బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాము నిజమేనా అని అడిగింది.
Also Read : Vijay Deverakonda : ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్ కి ముందు హాస్పిటల్ లో చేరిన విజయ్ దేవరకొండ..?
దీనికి ప్రేరణ సమాధానమిస్తూ.. వాళ్ళ ఫ్యామిలీ మేము క్లోజ్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నేను తెలుగులో స్టార్ అవుతాను, ఆమె కన్నడ లో స్టార్ అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయండి అని అనేవాళ్ళు. నేను, రష్మిక కూడా చాలా అనుకున్నాం. కానీ అది అవ్వలేదు. ఒకప్పుడు గుర్తుండేది తనకు, ఇప్పుడు గుర్తులేను. ఫస్ట్ తను కలవాలి అని చెప్పింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
అయితే దీనిపై పలువురు నెటిజన్లు రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్, పాత ఫ్రెండ్స్ ని పట్టించుకోని, వాళ్లకు టైం ఇచ్చేంత ఖాళీ ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు రష్మిక బిజీగా ఉండటం వల్లే కలవట్లేదేమో అని, ఇటీవల రష్మిక కూడా ఒక ఇంటర్వ్యూలో తన ఫ్రెండ్స్ ని కలవలేకపోతున్నందుకు బాధపడిందని చెప్పినట్టు గుర్తుచేస్తున్నారు. మరి ప్రేరణ – రష్మిక ఫ్యూచర్ లో కలుస్తారో లేదో చూడాలి.
Also Read : Junior : ‘జూనియర్’ మూవీ రివ్యూ.. జెనీలియా రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే..?