Venky Atluri : సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్

వరుణ్ తేజ్, రాశిఖన్నాతో తొలిప్రేమ సినిమా తీసి మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. అంతకంటే ముందే స్నేహగీతం, కేరింత లాంటి పలు సినిమాలకి రచయితగా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. తొలిప్రేమ తర్వాత........

Venky Atluri : సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్

Director Venky Atluri engagement happened

Updated On : December 11, 2022 / 8:01 AM IST

 

Venky Atluri :  వరుణ్ తేజ్, రాశిఖన్నాతో తొలిప్రేమ సినిమా తీసి మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. అంతకంటే ముందే స్నేహగీతం, కేరింత లాంటి పలు సినిమాలకి రచయితగా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. తొలిప్రేమ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో పర్వాలేదనిపించాడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం వెంకీ తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో తెలుగు-తమిళ్ బైలింగువల్ సినిమా ‘సర్’ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.

Sankranthi Theaters Issue : సినిమా అనేది బిజినెస్ అంతే.. సంక్రాంతి థియేటర్స్ ఇష్యూపై స్పందించిన నిర్మాత సురేష్ బాబు..

తాజాగా వెంకీ అట్లూరి నిశ్చితార్థం చేసుకున్నాడు. కేవలం కుటుంబ సభ్యులు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు వెంకీ. పలువురు వెంకీ స్నేహితులు ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు వెంకీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వెంకీ అట్లూరి ఏడడుగులు వేయబోతున్నాడు.