Balakrishna : ఆ గెటప్ లో ఉన్న 27 రోజులు.. తిండి లేకుండా.. కేవలం.. బాలయ్య డెడికేషన్ అలాంటిది..

బాలకృష్ణ భైరవ ద్వీపం సినిమాకు ఏ రేంజ్ లో కష్టపడ్డారో డైరెక్టర్ VN ఆదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Balakrishna : ఆ గెటప్ లో ఉన్న 27 రోజులు.. తిండి లేకుండా.. కేవలం.. బాలయ్య డెడికేషన్ అలాంటిది..

Director VN Aditya Tells about Balakrishna Hard Work for Bhairava Dweepam Movie 27 Days without Food

Updated On : April 20, 2025 / 12:02 PM IST

Balakrishna : సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు మన హీరోలు. ఇప్పటికి కూడా బాలయ్య సినిమాలో సీన్స్ కోసం బాగా కష్టపడతారు. యాక్షన్ సీన్స్ కూడా డూప్ లేకుండా చేస్తారు. అలాంటిది యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మరింత కష్టపడతారుగా. అలా బాలకృష్ణ భైరవ ద్వీపం సినిమాకు ఏ రేంజ్ లో కష్టపడ్డారో డైరెక్టర్ VN ఆదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా జానపద సోషియో ఫాంటసీ సినిమాగా వచ్చింది భైరవద్వీపం. అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇందులో బాలకృష్ణ ఓ కురూపి వేషం కూడా వేశారు. స్టార్ హీరోగా ఉన్న సమయంలో అలాంటి వేషం వేశారంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ గెటప్ లో ఉన్నప్పుడు తిండి లేకుండానే కష్టపడ్డారట.

Also Read : Abhinaya Wedding Photos : ప్రియుడితో నటి అభినయ పెళ్లి.. మరిన్ని ఫొటోలు..

డైరెక్టర్ VN ఆదిత్య భైరవ ద్వీపం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భైరవ ద్వీపం సినిమాలో బాలయ్య పడ్డ కష్టం గురించి చెప్తూ.. 27 రోజులు ఆయన కురూపి గెటప్ లో ఉన్న షూట్ చేసాం. ఆ 27 రోజులు పొద్దున మేకప్ వేస్తే షూట్ అయ్యేంతవరకు మేకప్ తీయరు. ఆ మేకప్ ఉంటే ఏమి తినలేరు. కేవలం స్ట్రా తో తీసుకునేవే తాగాలి. అలా 27 రోజులు షూటింగ్ ఉన్నంత సేపు కేవలం జ్యుస్ తాగి ఉన్నారు. డైలాగ్స్ చెప్పడం కూడా కష్టమయ్యేది. షూటింగ్ లో ఆయన పెదాలు కదిలించేవాళ్ళు, నేను పక్క నుంచి డైలాగ్ చెప్పేవాన్ని అని తెలిపారు.

1994లో ఆ సినిమా రిలీజయింది. అప్పట్లోనే బాలయ్య ఆ రేంజ్ లో 27 రోజులు షూటింగ్ సమయంలో ఏం తినకుండా కేవలం జ్యూస్ లు తాగి కష్టపడ్డారంటే గ్రేట్ అని చెప్పాల్సిందే.

Also Read : Mahesh Babu : అమ్మతో ఉన్న ఫోటో షేర్ చేసి.. మిస్ యు అమ్మ అంటూ మహేష్ బాబు.. పోస్ట్ వైరల్

అలాగే.. అప్పట్లో కారవాన్స్ లేవు, షాట్ గ్యాప్ లో మేకప్ రూమ్స్ కి వెళ్ళేవాళ్ళు. బాలయ్య మాత్రం ఆ హెవీ గెటప్ తో అక్కడే అసిస్టెంట్స్ తో కూర్చొని మాట్లాడేవాళ్ళు అని తెలిపారు ఆదిత్య.