Director Yeshasvi : సందీప్ వంగ నా కంటే ఎక్కువ అన్నాడు.. మళ్ళీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫైర్ అయిన డైరెక్టర్..

‘సిద్దార్థ్ రాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా దర్శకుడు యశస్వి ఆ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు రధన్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా అవి వైరల్ అయ్యాయి.

Director Yeshasvi : సందీప్ వంగ నా కంటే ఎక్కువ అన్నాడు.. మళ్ళీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫైర్ అయిన డైరెక్టర్..

Director Yeshasvi Sensational Comments again on Music Director Radhan

Updated On : February 25, 2024 / 2:14 PM IST

Director Yeshasvi : ఇటీవల ‘సిద్దార్థ్ రాయ్’(Siddharth Roy) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా దర్శకుడు యశస్వి ఆ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు రధన్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా అవి వైరల్ అయ్యాయి. తమ సినిమాకి చాలా ఇబ్బందులు పెట్టాడని, మ్యూజిక్ టైంకి ఇవ్వలేదు అని, అతని వల్ల మా సినిమా లేట్ అయింది, బడ్జెట్ పెరిగింది, పని చేయకుండా మాతో గొడవలు పెట్టుకున్నాడు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొకరితో కొట్టించుకున్నాము, అతను చెన్నైలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు అంటూ రధన్(Radhan) పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

దీంతో ఓ దర్శకుడు సంగీత దర్శకుడిపై ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఓ మీడియా ప్రతినిధి దీనిపై ప్రశ్నించాడు. సినిమా అంతా అయ్యాక ఇలా ఓ మ్యూజిక్ డైరెక్టర్ పై వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు.

Also Read : Shanmukh Jaswanth : సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. డిప్రెషన్ లో ఉన్నాను.. అందుకే గంజాయి తీసుకున్నా..

దీనికి డైరెక్టర్ యశస్వి సమాధానమిస్తూ.. సినిమాలో కొన్ని చోట్ల BGM వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకోవాల్సి వచ్చింది. శాండీ అద్దంకి అని అతనికి అడిషినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్రెడిట్ కూడా ఇచ్చాను సినిమాలో. పెద్ద ప్రొడక్షన్స్ లో టెక్నిషియన్స్ ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇది మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని చేసిన సినిమా. టెక్నిషియన్స్ అందరూ సినిమా ఒప్పుకున్నాక బాధ్యతగా అనుకున్న టైంలో వర్క్ చేయాలి. ఏ ఒక్కరు సపోర్ట్ చేయకపోయినా సినిమా లేట్ అవుతుంది. సినిమా లేట్ అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా పెరుగుద్ది. చిన్న సినిమాలకు బడ్జెట్ దాటిపోతే అది చాలా కష్టం. మాకు రధన్ నుంచి మంచి కో ఆపరేషన్ రాలేదు. నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనే అలా చెప్పాను. అతను మంచి టెక్నిషియన్ కానీ భాద్యతగా చేయలేదు. నేను ఆ బాధతోనే అలా మాట్లాడాను, మీరు నా ప్లేస్ లో ఉన్నా అలాగే మాట్లాడతారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ నా కంటే ఎక్కువగానే రధన్ గురించి చెప్పాడు. చెప్పని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మంచి టెక్నిషియన్ అని అతని దగ్గరికి వెళ్తే అతను అందర్నీ ఇలా ఇబ్బంది పెడుతున్నారు. చిన్న సినిమాలకు అది కష్టం. నా ద్వారా ఇంకో నలుగురికి తెలియాలి, ఇంకొకరు బాధపడకూడదు అందుకే అతని గురించి చెప్పాను అని తెలిపాడు. దీంతో మరోసారి డైరెక్టర్ యశస్వి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి దీనిపై రధన్ స్పందిస్తాడేమో చూడాలి.