Disha patani: పింక్ బికినీతో అగ్గిరాజేసిన దిశాపటాని!
మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ దిశా పటాని. ఆ చిత్రంలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత

Disha Patani (Image:Instagram)
Disha patani: మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ దిశా పటాని. ఆ చిత్రంలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత దిశా పటాని మరో తెలుగు ప్రాజెక్ట్‌లో కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం టైగర్ ష్రాఫ్ నుండి సల్మాన్ లాంటి సీనియర్ హీరోల వరకు అందరితో సినిమాలు చేస్తూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది. దిశా సినిమాలతో పాటు మరో చేత్తో సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గర్ల్ అనిపించుకుంది.
దిశా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు హద్దులేమి ఉండవు. బికినీ ధరించి ఆమె చేసే అందాల విందు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. బికినీ భామగా నెట్టింట్లో దిశాకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు అమ్మడు షేర్ చేసినా ఆ ఫోటోలు నెట్టింట్లో మంటలు పెడుతుంటాయి. తాజాగా పింక్ బికినీలో దిశా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటే నెట్టింట్లో అభిమానులు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
కేవలం బికినీలు, ఫోటోషూట్స్ మాత్రమే కాదు తరచుగా తన రోజువారీ జీవితాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తాజాగా ఆమె బికినీ ధరించిన వీడియోను షేర్ చేయడం ద్వారా ఆమె అభిమానులను అట్రాక్ట్ చేసింది. నీలిరంగు పూల హాల్టర్-నెక్ బికినీ, లేత రంగులో మెరిసే మేకప్‌తో మైమరపించే చిరునవ్వుతో కనిపిస్తుంది. సూర్యరశ్మి కోసమే ఇలా అని దిశా చెప్పినా.. అది దేనికోసమైనా అందాలు మాత్రం అదరహో అంటున్నారు ఫ్యాన్స్.