Brahmanandam : బ్రహ్మానందం చివరగా థియేటర్లో చూసిన సినిమా ఏంటో తెలుసా? కచ్చితంగా షాక్ అవుతారు.. ఇలా కూడా ఉంటారా?

బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాతో రాబోతున్నారు.

Brahmanandam : బ్రహ్మానందం చివరగా థియేటర్లో చూసిన సినిమా ఏంటో తెలుసా? కచ్చితంగా షాక్ అవుతారు.. ఇలా కూడా ఉంటారా?

Do You Know about Brahmanandam Last Movie Watched in Theaters

Updated On : February 7, 2025 / 1:41 PM IST

Brahmanandam : సాధారణంగా సినిమా వాళ్ళు ఎవరైనా తాము చేసిన సినిమాలను థియేటర్స్ లో చూసి ఆనందిస్తారు. థియేటర్ స్క్రీన్ పై ఒక్కసారి కనిపిస్తే చాలు అనుకుంటారు ఆర్టిస్టులు. పేరు పడితే చాలు అనుకుంటారు సాంకేతిక నిపుణులు. కానీ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అసలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడరు అంట. దాదాపు 1000కి పైగా సినిమాలతో ఎన్నో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు బ్రహ్మానందం. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా మాత్రమే చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు.

బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాలో రియల్ లైఫ్ తండ్రికొడులు తాత మనవాళ్లుగా కనిపించబోతున్నారు. కామెడీ ఎమోషన్ గా తెరకెక్కుతున్న బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం అసలు థియేటర్స్ లో సినిమాలు చూడరని ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Also Read : CCL 2025 : సినిమా వాళ్ల క్రికెట్ పండ‌గ వ‌చ్చేసింది.. సీసీఎల్ 2025.. తెలుగు వారియ‌ర్స్ షెడ్యూల్ ఇదే.. ఎందులో చూడొచ్చంటే?

రాజా గౌతమ్ మాట్లాడుతూ.. మా నాన్న అసలు థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూడరు. మేము సినిమాకు వెళ్తే ఆయన ఎంట్రీ అప్పుడు ప్రేక్షకులు అరుపులు, పేపర్లు విసిరేయడాలు ఫోన్ లో షూట్ చేసి తీసుకొచ్చి చూపిస్తే ఏంట్రా ఇంత చేస్తున్నారు అని షాక్ అయ్యేవారు. టీవీలో మాత్రం అప్పుడప్పుడు చూస్తారు. టీవీలో చూసి ఎడిటింగ్, మ్యూజిక్ గురించి మాట్లాడతారు. ఆయన షూటింగ్ కి వెళ్లి వస్తే ఏదైనా ఎగ్జైటింగ్ క్యారెక్టర్ ఉంటే ఆ షూటింగ్ గురించి చెప్పేవాళ్ళు. రేసుగుర్రం సినిమాలో కిల్ బిల్ పాండే గురించి గొప్పగా చెప్పారు. ఆ సినిమా థియేటర్లో ఫ్యాన్స్ అరుపులు వీడియో తీసి చూపిస్తే నిజమేనా అని అడిగారు. ఆయన సినిమాలు, పాత్రల గురించి అభినందనలు వస్తే విని వదిలేస్తారు. అసలు ఆయన థియేటర్ కి వెళ్లి సినిమా చూడరు. ఆయన లాస్ట్ గా థియేటర్ లో చూసిన సినిమా అన్నమయ్య. అది కూడా రాఘవేంద్రరావు గారు మూవీ టీమ్ రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళతో వెళ్లి చూసొచ్చారు అని తెలిపారు.

Also Read : RGV : ఏ సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోని ఆర్జీవీ.. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు తెలుసా..

దీంతో తెరపై కనిపించి థియేటర్స్ లో మనల్ని అంతగా నవ్వించే బ్రహ్మానందం అసలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడరా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక అన్నమయ్య అంటే 1997 లో రిలీజయింది. అంటే ఆల్మోస్ట్ 27 ఏళ్ళ నుంచి బ్రహ్మానందం థియేటర్ కే వెళ్ళలేదు. సినిమాల్లో నటిస్తూ, స్టార్ కమెడియన్ అయి ఉండి థియేటర్ కి వెళ్లకుండా కూడా ఉంటారా? అసలు అలా ఉండగలుగుతారా అని షాక్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్, సినిమా లవర్స్.