Nayanthara : నయనతార ఏం చదివిందో తెలుసా? మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది..

నయనతార తల్లి తన చదువు గురించి చెప్పింది.

Nayanthara : నయనతార ఏం చదివిందో తెలుసా? మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది..

Do You Know about Nayanthara Study and how she gets First Movie Chance Here Details

Updated On : November 18, 2024 / 3:26 PM IST

Nayanthara : నేడు నయనతార పుట్టిన రోజు సందర్భంగా నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ చేసిన డాక్యుమెంటరీని రిలీజ్ చేసారు. ఈ డాక్యుమెంటరీలో తన కెరీర్, సినిమాలు, తన ప్రేమ పెళ్లి, కుటుంబం.. ఇలా అనేక విషయాల గురించి మాట్లాడింది. ఈ డాక్యుమెంటరీలో నయనతారతో పాటు పనిచేసిన పలువురు హీరోలు, టెక్నిషియన్స్ తో పాటు తన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కూడా కనిపించి నయన్ గురించి మాట్లాడారు.

ఈ క్రమంలో నయనతార తల్లి తన చదువు గురించి చెప్పింది. నయనతార తల్లి మాట్లాడుతూ.. తను డిగ్రీ చదివిన తర్వాత CA చదవాలనుకునేది. పార్ట్ టైం CMS కోర్స్ చేసేది. అప్పుడు నేను కానీ వాళ్ళ నాన్న కానీ కాలేజీకి తీసుకెళ్లి వదిలిపెట్టేవాళ్ళం. కాలేజీ అయ్యేవరకు బయట కార్ లోనే ఉండేవాళ్ళం. ఆ సమయంలో మోడల్ గా ఓ జ్యువెల్లరీ షాప్ కి ఫొటోలు ఇచ్చింది అని తెలిపింది.

Also Read : Nayanthara : ఆ సినిమా చేస్తున్నప్పుడు అందరూ విమర్శించారు.. అతను సినిమాలు వదిలేయమన్నాడు..

నయనతార మొదటి సినిమా దర్శకుడు సత్యన్ అంథికడ్ మాట్లాడుతూ.. తనని మొదటిసారి ఓ మ్యాగజైన్ లో జ్యువెల్లరీ యాడ్ లో చూసాను. అప్పుడే నా సినిమాకు ఫ్రెష్ ఫేస్ ను వెతుకుతున్నాను. దీంతో ఆ మ్యాగజైన్ ఎడిటర్ ని కలిసి నయనతార కాంటాక్ట్ తీసుకొని కాల్ చేసి సినిమాలో చేస్తావా అని అడిగితే టైం కావలి అంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఫోన్ చేసి నేను చెయ్యను, మా కజిన్స్ కు ఇష్టం లేదు అని చెప్పింది. అప్పుడు నీకు చెయ్యాలని ఉందా, మీ పేరెంట్స్ కు ఇష్టం ఉందా అని అడిగితే అవును అని చెప్పింది. దాంతో వచ్చి షూటింగ్ చూడమన్నాను. నచ్చితే చేయమన్నాను. అప్పుడు నయన్ వాళ్ళ అమ్మ నాన్నతో షూటింగ్ కి వచ్చింది. సెట్లో అందరితో కలిసిపోయింది. రెండు రోజులకే తన క్యారెక్టర్ గురించి అడిగింది అని తెలిపాడు. అలా నయన్ మొదట మలయాళంలో మనసినక్కరే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.