Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా డైరెక్షన్ చేసారని తెలుసా? అయ్యప్ప మాలలో..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఓ సినిమాలో కొంత భాగం డైరెక్ట్ చేశారట. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే చెప్తారని. డైరెక్షన్ లో సలహాలు ఇస్తారని అనేకమంది దర్శకులు చెప్పారు. ఇటీవల అనిల్ రావిపూడి కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి చిరంజీవి సజెషన్స్ ఇచ్చారని చెప్పారు. అయితే చిరంజీవే ఓ సినిమాలో కొంతభాగం డైరెక్షన్ చేసారని మీకు తెలుసా?(Chiranjeevi)
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఓ సినిమాలో కొంత భాగం డైరెక్ట్ చేశారట. తాజాగా ఈ విషయం తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read : Nivita : అప్పట్లో పవన్ కళ్యాణ్ తో స్టేజి మీద వైరల్ అయిన నటి.. ఇప్పుడు జనసేనలోకి..
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. చిరంజీవి బిగ్ బాస్ సినిమాలో నాది నెగిటివ్ క్యారెక్టర్. ఆ సినిమాకు విజయ బాపినీడు డైరెక్టర్. చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలో ఓ సీన్ లో చిరంజీవి అయ్యప్ప మాల మీద ఉంటారు. నేను ఆయన మాల తెంపాలి. ఆ తర్వాత ఫైట్. అదే నా ఇంట్రడక్షన్ సీన్. ఆ సీన్ సమయంలోనే డైరెక్టర్ విజయ బాపినీడు క్లోజ్ ఫ్రెండ్ కి హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఆయన వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ ఆగడానికి లేదు. చిరంజీవి గారి డేట్స్ లేవు మళ్ళీ.
ఆర్టిస్టుల డేట్స్, ప్రొడ్యూసర్ మనీ వేస్ట్ అవుతుంది. విజయ్ బాపినీడు లేకపోవడంతో డైరెక్షన్ ఎవరు చేయాలి అని వచ్చింది. దాంతో చిరంజీవి గారే ఆ ఫైట్ మొత్తం, ఆ సీన్స్ అన్ని డైరెక్ట్ చేసారు. అప్పుడు ఆయన సాంకేతిక జ్ఞానం చూసి నేను షాక్ అయ్యాను. సినిమాని సరిగ్గా గమనిస్తే సినిమా మొత్తంలో ఆ ఒక్క పోర్షన్ స్పెషల్ గా కనిపిస్తుంది. మూడు రోజులు చిరంజీవి ఆ సినిమాని డైరెక్ట్ చేసారు అని తెలిపారు.
Also Read : Arjun Sarja : తాగొచ్చి అభిమాని చేసిన పనికి.. యాక్షన్ కింగ్ అర్జున్ ఏం చేసాడో తెలుసా..?
1995లో విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా బిగ్ బాస్. ఆ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించినా, చిరు పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆ సినిమాలో చిరంజీవి స్టైల్, హెయిర్ స్టైల్, మాస్ లుకింగ్స్ కొత్తగా, డిఫరెంట్ గా ఉంటాయి. బిగ్ బాస్ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇప్పటికి హైలెట్ గా నిలుస్తుంది.
చిరంజీవి బిగ్ బాస్ సినిమాలో డైరెక్షన్ చేసిన సీన్ ఇదే..
