Friday Sentiment : సినిమాలు శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారు?

భారతదేశంలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి. ఈ సెంటిమెంట్ ఎప్పటి నుండి ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి?

Friday Sentiment : సినిమాలు శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారు?

Friday Sentiment

Updated On : December 22, 2023 / 7:43 PM IST

Friday Sentiment : భారతదేశంలో సినిమాలు థియేటర్లలో శుక్రవారం రిలీజ్ చేస్తారు. దీనికి సెంటిమెంటే కారణమా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? చదవండి.

ఒకప్పుడు సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేస్తుండేవారు. అలా సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత కల్చర్ మారింది. శుక్రవారం కొత్త సినిమాలు విడుదల చేయడం సంప్రదాయంగా మారింది. అయితే వీకెండ్ కావడంవల్ల ఇలా డిసైడ్ చేసి ఉంటారని చాలామంది అనుకుంటారు. అయితే శుక్రవారం సినిమాలు రిలీజ్ చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

Kalyaan Dhev : అక్క సీమంతం వేడుకలో కూతురితో కళ్యాణ్ దేవ్..శ్రీజ పోలికలే అంటున్న నెటిజన్లు

అప్పట్లో కార్మికులకు వేతనాలు వారానికి ఒకసారి ఇచ్చేవారట. సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసాక శని,ఆదివారాలు సెలవులు ఇచ్చేవారట. శుక్రవారం వేతనం తీసుకున్న కార్మికులు అదే రోజు లేదా శని, ఆదివారాల్లో థియేటర్లకు వెళ్లేవారట. వాళ్లని దృష్టిలో పెట్టుకుని ఈ  కల్చర్ మొదటగా హాలీవుడ్ USA లో 1939 లో మొదలుపెట్టారు. క్లార్క్ గేబుల్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ‘గాన్ విత్ ది విండ్’ డిసెంబర్ 15 శుక్రవారం రిలీజ్ చేసారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హాలీవుడ్‌లో మొదలైన శుక్రవారం రిలీజ్ సంప్రదాయాన్ని బాలీవుడ్ అమలు చేసింది. ‘మొఘల్-ఇ-ఆజం’ సినిమా ఆగస్టు 5, 1960 శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఆ తరువాత నుండి ఇక్కడ కొత్త సినిమాలు శుక్రవారం విడుదల చేసే కల్చర్ మొదలైంది. అంతకు ముందు కొత్త సినిమాలు అమావాస్య రోజున కూడా విడుదల చేసేవారట. అన్నదాతలు ఆ రోజున పనిచేయరు కాబట్టి సినిమా చూడటానికి వచ్చేవారట. అలా అమావాస్యకు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవట.

RGV : విజయవాడలో ఆర్జీవీ.. రేపే భారీగా ‘వ్యూహం’ జగగర్జన ఈవెంట్..

ఇక భారతదేశంలో శుక్రవారం శుభదినంగా లక్ష్మీదేవతను కొలుస్తారు. శుక్రవారం సినిమా రిలీజ్ చేస్తే నిర్మాతలకు కలిసి వస్తుందని నమ్ముతారు. ఇంకో కారణం కూడా ఉంది. ఇందులో కమర్షియల్ కోణం ఉంది. మల్టీప్లెక్స్ యజమానులకు నిర్మాతలు చెల్లించాల్సిన ఫీజు శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కొన్ని కారణాల వల్ల భారతదేశంలో సినిమాలు శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కావడం మొదలయ్యాయి. ఇటీవల కొందరు మాత్రం సినిమా వసూళ్లు సరిపోవడం లేదని ఒకరోజు ముందు అంటే గురువారం కూడా రిలీజ్‌లు మొదలుపెట్టారు.