Arjun Reddy : ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అప్పుడు లక్షల్లో ఇప్పుడు కోట్లల్లో..

తన అర్జున్ రెడ్డి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిపాడు. 

Arjun Reddy : ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అప్పుడు లక్షల్లో ఇప్పుడు కోట్లల్లో..

Arjun Reddy

Updated On : August 2, 2025 / 2:10 PM IST

Arjun Reddy : విజయ్ దేవరకొండ ఇటీవలే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 53 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. విజయ్ దేవరకోండ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన అర్జున్ రెడ్డి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిపాడు.

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాకు 5 లక్షలు రెమ్యునరేషన్ సందీప్ రెడ్డి వంగా ఇచ్చాడని తెలిపాడు. ఆ సినిమాకు సందీప్ తన తండ్రి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ తీసాడు. అప్పట్లో 5 లక్షలు అంటే నాకు చాలా ఎక్కువ. ఆ తర్వాత ఆ సినిమాకు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డు వేలం వేస్తే 25 లక్షలు వచ్చాయి. అవి చాలా పెద్ద అమౌంట్. అవి సొసైటీకి ఇచ్చేసాను అని తెలిపాడు.

Also Read : Kingdom Collections : రెండు రోజుల్లో హాఫ్ సెంచ‌రీ కొట్టిన విజ‌య్‌.. కింగ్‌డ‌మ్‌ క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

అప్పుడు విజయ్ దేవరకొండ 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకోగా ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.