Kingdom Collections : రెండు రోజుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన విజయ్.. కింగ్‌డమ్ కలెక్షన్స్ ఎంతంటే..?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్‌డమ్.

Kingdom
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్‌డమ్. భాగ్య శ్రీ బోర్సే కథానాయిక నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం (జూలై 31న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. తొలి రోజు ఈ చిత్రం 39 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ రెండు రోజుల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Anasuya Bharadwaj : ‘చెప్పు తెగుద్ది..’ అంటూ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.. వీడియో వైరల్
That’s how #KINGDOM gets hailed big with the audience’s love 💥💥#BoxOfficeBlockbusterKingdom hits 53Cr+ worldwide gross in 2 days 🔥🔥
🎟️ – https://t.co/4rCYFkzxoa@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon… pic.twitter.com/xW6M0dd3s8
— Sithara Entertainments (@SitharaEnts) August 2, 2025
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రల్లో నటించారు.