Cyber Crime : టెలిగ్రామ్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేస్తున్నారా? ఐతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ..
కొత్త సినిమా చూడాలని ఫ్రీ డౌన్ లోడ్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారా? అంతే... ఇక రియల్ సినిమా కనిపిస్తుంది. ఆనక బాధపడి ప్రయోజనం ఉండదు.

Cyber Crime
Cyber Crime : థియేటర్లోకి కొత్త సినిమా వస్తే చాలు చూడాలని అందరూ తహతహలాడతారు. థియేటర్లకు వెళ్లడానికి కుదరని వాళ్లు OTT ప్లాట్‌ఫామ్‌లు ఆశ్రయిస్తారు. వాటిలో స్ట్రీమింగ్‌కి కాస్త సమయం పడుతుంది.. OTT లలో సబ్‌స్క్రిప్షన్ చేసుకోని వారంతా ఆ సినిమాల కోసం రకరకాల సైట్స్ వెతుకుతుంటారు. అక్కడే చిక్కుల్లో పడతారు. టెలిగ్రామ్ నుండి సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారా? మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము మాయమయ్యే ప్రమాదం పొంచి ఉందని మీకు తెలుసా?
Cyber Criminals : నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు…వెంటాడి పట్టుకున్న పోలీసులు
చాలామందికి సినిమాలంతే విపరీతమైన ఇష్టం ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయితే వెంటనే చూడాలనే ఉబలాటపడతారు. థియేటర్లకు వెళ్లకుండానే.. OTT లలో సబ్‌స్క్రిప్షన్ లేకుండానే కొందరు ఫ్రీగా చూడాలని ఆశపడతారు.. అందుకోసం రకరకాల సైట్స్ సెర్చ్ చేస్తారు. తాము చూడాలనుకున్న సినిమా కనిపిస్తే ఫ్రీగా చూసేస్తారు. పైసలు ఖర్చు కాకుండా సినిమా చూసామన్న సంబరం అటుంచితే ఆనక జరగబోయే అనర్ధాన్ని అస్సలు ఊహించరు. అసలు ఇలాంటి వారి కోసం సైబర్ నేరగాళ్లు కాచుకుని కూర్చున్నారనే విషయం పూర్తిగా మోసపోయాక అర్ధం అవుతుంది.
ఇటీవల కాలంలో చాలామంది టెలిగ్రామ్ యాప్ వినియోగిస్తున్నారు. ఇందులో ఫ్రీ డౌన్ లోడ్ లింక్స్ కనిపిస్తాయి. తాము చూడాలనుకున్న సినిమా కనిపిస్తే చాలు వెనకా ముందు ఆలోచించకుండా డౌన్ లోడ్ చేసేస్తారు. కొత్త సినిమా చూసామన్న సంబరం కొద్దిసేపే.. మేలుకునే లోపు బ్యాంకు ఖాతాలో సొమ్ము మొత్తం ఖాళీ అయిపోతుంది. పర్సనల్ డేటా, బ్యాంకు వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము గుల్ల చేస్తున్నారని తాజాగా కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ వెల్లడించింది. సో.. అలాంటి లింక్స్ డౌన్ లోడ్ చేయకపోవడమే మంచిది. లేదంటే ఆనక బాధపడి ప్రయోజనం ఉండదు. ఇటీవల కాలంలో ఇలాంటి లింక్స్ షేర్ చేస్తూ అనేక యాప్‌లు కనిపిస్తున్నాయి. కొత్త సినిమా చూడాలన్న ఆత్రంలో వాటిని క్లిక్ చేయవద్దని ఇప్పటికే సైబర్ దోస్త్ హెచ్చరిస్తోంది. కొత్త సినిమా చూడాలన్న ఆత్రంలో ఫ్రీలింక్‌ల మాయలో పడితే రియల్ సినిమా కనిపిస్తుంది. కాబట్టి బీ కేర్ ఫుల్.