Cyber Criminals : నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు…వెంటాడి పట్టుకున్న పోలీసులు

వెంటాడుతున్న పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలోకి దూకిన ఉదంతం జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు సైతం నదిలో వెంటాడి నిందితులను ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు....

Cyber Criminals : నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు…వెంటాడి పట్టుకున్న పోలీసులు

Cyber Criminals jump into river

Cyber Criminals : వెంటాడుతున్న పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలోకి దూకిన ఉదంతం జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు సైతం నదిలో వెంటాడి నిందితులను ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు సైబర్ నేరగాళ్లు యాప్‌ల ద్వారా నగ్న వీడియో కాల్స్ చేస్తూ, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి స్క్రీన్‌షాట్‌లు తీసుకుని మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ALSO READ : Telangana Cool Winds : తెలంగాణలో పెరిగిన చలిగాలులు…ప్రజలను వణికిస్తున్న చలి

పోషకాహార ట్రాకర్ యాప్ ద్వారా ప్రసూతి ప్రయోజనాల గురించి తప్పుడు వాగ్దానాలతో గర్భిణులను కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానా పాట్లు పడ్డారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు పిల్లల దొంగలని నిందితులు తప్పుడు పుకార్లు వ్యాప్తి చేశారు.

ALSO READ : Crimes Against Women : దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే…

నదిలోకి దూకి పారిపోతున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.8.29 లక్షల నగదు, 12 మొబైల్ ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 12 పాస్ పుస్తకాలు, ఆరు చెక్కులు, నాలుగు పాన్ కార్డులు, రెండు ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : Telangana Minister Seethakka : అడవి బాట నుంచి అమాత్యురాలిగా…సీతక్క వినూత్న రాజకీయ ప్రయాణం