Prabhas : ప్రభాస్‌ని మీరేమన్నా ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారా.. ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య..
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇక కొత్త ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. కాగా ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ, ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడో అని అందరిలో ఆశక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బాలయ్య రెబల్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Do you want to ask Prabhas any questions?
Prabhas : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే అదిరిపోయే గెస్ట్ లను తీసుకు వచ్చిన ఆహా టీమ్, ఈసారి పాన్ ఇండియా గెస్ట్ పై కన్నేశారు. గత కొన్నిరోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్, అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి అతిధిగా రాబోతున్నాడు అంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఇవాళ వాటిని నిజం చేస్తూ షో నిర్వాహకులు స్పెషల్ వీడియోని విడుదల చేశారు.
Prabhas : ప్రభాస్ కొత్త లుక్ అదుర్స్.. లీకైన అన్‌స్టాపబుల్ వీడియో..
దీంతో అధికారికంగా కూడా ప్రకటన వచ్చేయడంతో, కొత్త ఎపిసోడ్ పై భారీ హైప్ నెలకుంది. కాగా ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ, ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడో అని అందరిలో ఆశక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బాలయ్య రెబల్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. “మీరు ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగాలి అని అనుకుంటున్నారో అవి ఆహా ట్విట్టర్ అకౌంట్ లో తెలియజేయండి. క్వశ్చన్ క్రేజీగా ఉంటేనే బాలయ్య అడుగుతాడు” అంటూ షో నిర్వాహకులు ట్వీట్ చేశారు.
దీంతో డార్లింగ్ అభిమానులు అంతా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. అదే ప్రభాస్ పెళ్లి విషయం. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. బాలయ్యకి అయిన తన మ్యారేజ్ గురించి చెబుతాడేమో చూడాలి. కాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అవ్వగా, నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే ఈ షో హైయెస్ట్ వ్యూస్ తో నెంబర్ వన్ గా నిలిచింది. మరి ఇప్పుడు పాన్ ఇండియా రాకతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Hello Rebel Star fans!!!
What is that one question you want NBK to ask Prabhas on #UnstoppableWithNBKS2? Question crazy ga untene Balayya aduguthadu..?
Shoooooot…#NBKWithPrabhas #Prabhas— ahavideoin (@ahavideoIN) December 11, 2022