RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..

‘పులికి, విలుకాడికి.. తలకి, ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్లకి.. రవికి, మేఘానికి.. దోస్తీ’..

RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..

Rrr Dosti Music Video

Updated On : August 1, 2021 / 12:33 PM IST

RRR RRR Dosti: ‘ఆర్ఆర్ఆర్’ టీం ఫ్రెండ్‌షిప్‌ డే విషెస్‌తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’..

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. స్వరవాణి కీరవాణి కంపోజిషన్‌లో రామ్, భీమ్ దోస్తీ నేపథ్యంలో రూపొందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా.. హేమచంద్ర అద్భుతంగా పాడారు.

RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..

‘పులికి, విలుకాడికి.. తలకి, ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్లకి.. రవికి, మేఘానికి.. దోస్తీ’.. అంటూ సాగే ‘ఆర్ఆర్ఆర్ దోస్తీ’ మ్యూజిక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళ్), విజయ్ జేసుదాస్ (మలయాళం), యాసిన్ నిజార్ (కన్నడ) భాషల్లో ఈ పాటను చాలా చక్కగా పాడారు.