Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’గా దుల్కర్.. మరో డైరెక్ట్ తెలుగు సినిమాతో..

ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాని ప్రకటించారు. తాజాగా నేడు దుల్కర్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్.

Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’గా దుల్కర్.. మరో డైరెక్ట్ తెలుగు సినిమాతో..

Dulquer Salmaan next Telugu Movie Under Venky Atluri Direction Titled as Lucky Baskhar

Dulquer Salmaan : టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ సార్(తమిళ్‌లో ‘వాతి’) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తమిళ హీరో ధనుష్ ముఖ్య పాత్రలో నటించిన ‘సార్’ మూవీ తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.

ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాని ప్రకటించారు. తాజాగా నేడు దుల్కర్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. లక్కీ భాస్కర్ అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా డబ్బు చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కింది.

Anushka Shetty : సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న అనుష్క.. ఆ సినిమా తర్వాత?

డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాణ సంస్థ, దుల్కర్.. ముగ్గురు హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దుల్కర్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు లక్కీ భాస్కర్ గా రాబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనున్నట్టు సమాచారం.